BIKKI NEWS (DEC -18) : ఇండియన్ నేవీ – సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (INCET – 2023) నోటిఫికేషన్ ను (indian navy civilian entrance test 2023) జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఛార్జ్ మాన్, సీనియర్ డ్రాఫ్ట్స్ మాన్, ట్రేడ్స్ మాన్ మేట్ వంటి 910 పోస్టులు భర్తీ కానున్నాయి.
అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా డిసెంబర్ 18 నుంచి 31 మద్య దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు : పోస్టును అనుసరించి 10వ తరగతి, సంబంధిచి విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి : 31-12-2023 నాటికి ఛార్జ్ మాన్/ ట్రేడ్స్ మాన్ మేట్ పోస్టులకు 25 ఏళ్లు. సీనియర్ డ్రాఫ్ట్ మాన్ పోస్టులకు 27 సంవత్సరాలు మించకూడదు. (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)
దరఖాస్తు రుసుము: రూ.295/- (ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)
ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ స్క్రీనింగ్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తు గడువు :డిసెంబర్ 18 నుండి 31 -2023 వరకు