భారత రాజ్యాంగ రచన – ముఖ్య తేదీలు

BIKKI NEWS : భారత రాజ్యాంగ రచనకు శ్రీకారం చుట్టిన తర్వాత వివిధ తేదీలలో జరిగిన ముఖ్య సంఘటనలు వివరంగా…

డిసెంబర్ – 06 – 1946 : రాజ్యాంగసభ ఏర్పాటు

డిసెంబర్ – 09 – 1946 : పార్లమెంట్ సెంట్రల్ హల్ (రాజ్యాంగ హల్) లో మొదటి రాజ్యాంగ సభ సమావేశం జరిగింది. మొదట ప్రసంగించిన వ్యక్తి జేబీ కృపాలాని.

డిసెంబర్ – 11 – 1946 : రాజ్యాంగ సభ అధ్యక్షుడిగా రాజేంద్రప్రసాద్, వైస్ చైర్మన్ గా హరీంద్ర కూమర్ ముఖర్జీ, న్యాయ సలహాదారు గా బీఎన్. రావు లు ఎన్నికయ్యారు.

డిసెంబర్ – 13 – 1946 : జవహర్‌లాల్ నెహ్రూచే ‘ఆబ్జెక్టివ్ రిజల్యూషన్’ సమర్పించబడింది, రాజ్యాంగం యొక్క అంతర్లీన సూత్రాలను సూచించారు, అది తరువాత ‘రాజ్యాంగ ప్రవేశిక’గా మారింది.

జనవరి – 22 – 1947 : ఆబ్జెక్టివ్ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

జూలై – 22 – 1947 : జాతీయ పతాకాన్ని స్వీకరించారు

ఆగస్టు – 15 – 1947 : స్వాతంత్య్రం సిద్దించింది. డోమినియన్ ఆఫ్ ఇండియా & పాకిస్థాన్ లుగా విడిపోయాయి.

ఆగస్టు – 29 – 1947 : Dr.B.R.అంబేద్కర్ చైర్మన్‌గా డ్రాఫ్టింగ్ కమిటీని (ముసాయిదా కమిటీ) నియమించారు.

జూలై – 16 – 1948 : రాజ్యాంగ సభకు రెండో వైస్ చైర్మన్ గా టీ. కృష్ణమాచారి ఎంపికయ్యారు.

నవంబర్ – 26 – 1949 : రాజ్యాంగ రచన పూర్తి, రాజ్యంగ సభ భారత రాజ్యంగాన్ని అమోదించారు

జనవరి – 24 – 1950 : రాజ్యాంగ సభ చివరి సమావేశం. భారత రాజ్యాంగాన్ని అమోదిస్తూ సంతకాలు పూర్తి. (8 – షెడ్యూల్స్, 22 – భాగాలు, 385 ఆర్టికల్స్ కలవు)

జనవరి – 26 – 1950 : భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు. ( రాజ్యాంగ రచనకు 2సం. ల 11 నెలల 18 రోజులు పట్టింది.) (దాదాపు 64 లక్షల రూపాయలు ఖర్చు అయింది.)