BIKKI NEWS (MAY 15) : Indian army Technical Graduate Course 2026. టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ 2026 జనవరి సెషన్ కు సంబంధించి నోటిఫికేషన్ ను సర్వీస్ సెలెక్షన్ బోర్డు విడుదల చేసింది.
Indian army Technical Graduate Course 2026
ఇందులో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాలో శాశ్వత ప్రాతిపాదికన ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం ఖరారవుతుంది.
పోస్ట్ వివరాలు : లెఫ్టినెంట్ హోదా (టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ 2025)
ఖాళీల వివరాలు : 30
అర్హతలు : బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించిన పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు.
వయోపరిమితి : జనవరి 01 – 2026 నాటికి 20 నుండి 27 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి
దరఖాస్తు గడువు : మే 29 – 2025 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానము : బీఈ, బీటెక్ లో సాధించిన మార్కుల ఆధారంగా కట్ ఆఫ్ మార్కులను నిర్ణయిస్తారు.
షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ప్రక్రియ రెండో దశల్లో ఉంటుంది.
స్టేజ్ వన్ ఇంటర్వ్యూలో ఇంటిలిజెన్స్ పై పరీక్షలు ఉంటాయి.
స్టేజ్ 2 కి ఎంపికైన వారికి నాలుగు రోజులపాటు వివిధ పరీక్షలు నిర్వహించి, తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తారు.
శిక్షణ : ఎంపికైన అభ్యర్థులకు డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో 12 నెలల పాటు శిక్షణ ఉంటుంది
స్టైఫండ్ : శిక్షణ సమయంలో నెలకు 56,100/- రూపాయలు స్టైఫండ్ అందజేస్తారు.
వేతనం : మూల వేతనం 56,100 & అన్ని రకాల అలవెన్స్ లు కలుపుకొని లక్ష వరకు వేతనం అందుకునే అవకాశం.
వెబ్సైట్ : https://www.joinindianarmy.nic.in/Authentication.aspx
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్