CVC : ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ

హైదరాబాద్ (మే – 30) : సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (CVC) గా ప్రవీణ్ కుమార్ శ్రీ వాస్తవ చేత రాష్ట్రపతి ద్రౌపతి సమక్షంలో మే 29న బాధ్యతలు స్వీకరించారు.

ప్రస్తుత సీవీసీ సురేష్ ఎం. పటేల్ పదవీకాలం గతేడాది డిసెంబర్ తో పూర్తైంది. అప్పటినుంచి శ్రీ వాస్తవ తాత్కాలిక సివిసిగా కొనసాగుతున్నారు. సివిసి గా 65 ఏళ్ల వచ్చేవరకు లేదా నాలుగేళ్ల కాలానికి బాధ్యతల్లో కొనసాగుతారు. సివిసి సారధ్యంలో విజిలెన్స్ కమిషనర్ లో గరిష్టంగా ఇద్దరు కమీషనర్లు ఉండొచ్చు. ప్రస్తుతం అరవింద్ కమీషనర్ గా ఉన్నారు. ఇంకొక కమిషనర్ పోస్ట్ ఖాళీగా ఉంది.