DAILY CURRENT AFFAIRS IN TELUGU 29th MAY 2023
1) ఐపీఎల్ 2023 విజేత, రన్నర్ గా ఎవరు నిలిచారు.?
జ : చెన్నై సూపర్ కింగ్స్ (5వ సారి), గుజరాత్ టైటాన్స్ .
2) ఐపీఎల్ 2023లో అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్ల తీసిన ఆటగాళ్లుగా ఎవరు నిలిచారు.?
జ : శుభమన్ గిల్ (890), మొహమ్మద్ షమీ (28)
3) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో భారత్ లోకి వచ్చిన విదేశీ ప్రత్యౄ పెట్టుబడులు ఎంత.?
జ : 44 బిలియన్ డాలర్లు
4) 2022- 23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా ఏ దేశం నుండి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.?
జ : సింగపూర్
5) 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో ఏ రాష్ట్రంలోకి అత్యధికంగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి.?
జ : మహారాష్ట్ర
6) జూన్ 4వ తేదీన భారత రాష్ట్రపతి సూరినామ్ దేశంలో పర్యటించనున్నారు. అక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొననున్నారు.?
జ : భారతీయులు సురినామ్ దేశంలో అడుగు పెట్టిన 150 ఏళ్ళ వేడుకలు
7) జూన్ మాసంలో సెర్జియా దేశంలో భారత రాష్ట్రపతి పర్యటించనున్నారు. ఈ దేశంలో పర్యటిస్తున్న భారత ఎన్నో రాష్ట్రపతిగా ముర్ము నిలువనున్నారు.?
జ : మొదటి రాష్ట్రపతి
8) జూన్ 4, 5వ తేదీలలో హైదరాబాదులో జరగనున్న జి20 సమావేశాల పేరు ఏమిటి?
జ : జి20 దేశాల హెల్త్ వర్కింగ్ గ్రూప్ సదస్సు
9) ఏ సంవత్సరం వరకు చంద్రుని మీదకు మానవ సహిత ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు చైనా పేర్కొంది.?
జ : 2030
10) NVS – 01 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టిన రాకెట్ పేరు ఏమిటి?
జ : GSLV – F12
11) NVS- 01 ఉపగ్రహంలో అమర్చిన అణు గడియారం ఏది.?
జ : రూబీడియం అణు గడియారం
12) భారత్లో పర్యటిస్తున్న కాంబోడియా రాజు పేరు ఏమిటి.?
జ : నరోదమ్ సిహమోని
13) ఇస్రో చంద్రయాన్ – 3 కార్యక్రమాన్ని ఏప్పుడు చేపట్టనుంది.?
జ : జులై – 2023
14) ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా కంటే మించిన వైరస్ త్వరలో మానవులలో వ్యాపిస్తుందని పేర్కొంది. ఆ వైరస్ ను ఏమని పిలుస్తున్నారు.?
జ : డిసీజ్ – ఎక్స్
15) 1926లో సెంగోల్ తయారుచేసిన తమిళనాడుకు చెందిన వ్యక్తి పేరు ఏమిటి?
జ : ఉమ్మిడి ఎతిరాజులు
16) ప్రపంచ తేనెటీగల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మే 20
17) ప్రపంచంలో అత్యధిక వ్యవసాయ భూమి ఏ దేశంలో ఉంది.?
జ : అమెరికా (భారత్ రెండో స్థానం)
18) డెంగ్యూ వ్యాధి నివారణకు వ్యాక్సిన్లు తయారీ కి ఏ సంస్థలకు ఐసిఎంఆర్ ఆమోదం తెలిపింది.?
జ : సీరం ఇనిస్టిట్యూట్, పానసియా బయోటెక్
19) ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కొరకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న బడిబాట కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టారు.?
ప్రో. జయశంకర్ బడిబాట
20) ఐపీఎల్ 2023వ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మరియు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా ఎవరు నిలిచారు.?
జ : శుభమన్ గిల్