BIKKI NEWS (SEP. 09) : INDIA MEDALS LIST IN PARIS PARA OLYMPICS 2024. పారిస్ వేదికగా జరిగిన పారా ఒలింపిక్స్ 2023లో భారత్ 29 పతకాలతో 18వ స్థానంలో నిలచి సత్తా చాటింది.
పారిస్‌లో 25 పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత పారా క్రీడాకారుల బృందం.. లక్ష్యాన్ని అధిగమించడమే గాక మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించారు.
గత పారాలింపిక్స్ (టోక్యో)లో నెగ్గిన 19 పతకాలే ఇప్పటివరకూ అత్యధికం కాగా పారిస్‌లో మాత్రం అంతకంటే మరో పది పతకాలు ఎక్కువే సాధించింది.
84 మంది బృందంతో పారిస్‌కు వెళ్లిన భారత్‌కు ఐదు క్రీడాంశాల (ఆర్చరీ, బ్యాడ్మింటన్, షూటింగ్, జూడో, అథ్లెటిక్స్)లో 7 స్వర్ణాలు, 9 రజతాలు 13 కాంస్య పతకాలు సాదించింది.
పతకాల పట్టికలో భారత్.. స్విట్జర్లాండ్, దక్షిణ కొరియా, అర్జెంటీనా వంటి దేశాలను వెనక్కినెట్టి టాప్-20లో (18వ స్థానం) నిలవడం విశేషం. ఆదివారంతో పారాలింపిక్స్ అట్టహాసంగా ముగిశాయి.
INDIA MEDALS LIST IN PARIS PARA OLYMPICS 2024
స్వర్ణ పతక విజేతలు (7)
1) అవనీ లేఖరా (షూటింగ్)
2) నితీష్ కుమార్ (బ్యాడ్మింటన్)
3) సుమిత్ అంటిల్ (జావెలిన్ త్రో)
4) హర్వీందర్ సింగ్ (రికర్వ్ ఓపెన్)
5) ధరంభీర్ (క్లబ్ త్రో)
6) ప్రవీణ్ కుమార్ (హై జంప్)
7) నవదీప్ సింగ్ (జావెలిన్ త్రో)
రజత పతక విజేతలు (9)
1) మనీష్ నర్వాల్ (షూటింగ్)
2) నిషాద్ కుమార్ (హైజంప్)
3) టీ. మురుగేశన్ (బ్యాడ్మింటన్)
4) సుహస్ యతిరాజ్ (బ్యాడ్మింటన్)
5) సహ్రద్ కుమార్ (హైజంప్)
6) అజిత్ సింగ్ (జావెలిన్ త్రో)
7) సచిన్ కిలారి (షాట్ పుట్)
8) పర్నవ్ సోర్మా (క్లబ్ త్రో )
9) యోగేశ్ కతునియా (డిస్కస్ త్రో)
కాంస్య పతక విజేతలు (13)
1) మోనా ఆగర్వాల్ (షూటింగ్)
2) ప్రీతి పాల్ (100 మీటర్ల రన్నింగ్)
3) రుబీనా ప్రాన్సిస్ (షూటింగ్)
4) ప్రీతి పాల్ (200 మీటర్ల రన్నింగ్)
5) మనీషా రాందాస్ (బ్యాడ్మింటన్)
6) రాకేష్ కుమార్/ సీతల్ దేవి – ఆర్చరీ
7) నిత్యా శ్రీ శివన్ – బ్యాడ్మింటన్
8) దీప్తి జివాంజీ (400 మీ. రన్నింగ్)
9) యమ్. తంగవేలు (హైజంప్)
10) సుందర్ సింగ్ గుర్జార్ (జావెలిన్ త్రో)
11) కపిల్ పర్మార్ (జూడో)
12) హెచ్ హెచ్ సేమా (షాట్ పుట్)
13) సిమ్రాన్ (200 మీ. రన్నింగ్)