BIKKI NEWS (JUNE 20) : INDIA – ENGLAND 1st test Day 1 report. ఇండియా – ఇంగ్లాండ్ జట్ల మధ్య టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న మొదటి టెస్ట్ మొదటి రోజు ఆటలో భారత్ పైచేయి సాధించింది.
INDIA – ENGLAND 1st test Day 1 report.
టీమిండియా ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ (101) సెంచరీ మరోవైపు కెప్టెన్ శుభమన్ గిల్ (127*) సెంచరీలతో ఇంగ్లాండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని తొలి రోజు టీమిండియాను ఆధిక్యంలో నిలిపారు.
మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 42 పరుగులు చేసి అవుట్ కాగా, రిషబ్ పంత్ (62*) చేసి శుభమన్ గిల్ తో కలిసి క్రీజులో ఉన్నాడు.
ఇంగ్లాండ్ బౌలర్లలో కెప్టెన్ బెన్ స్టోక్స్ 2 వికెట్లు తీయగా, బ్రిడెన్ కార్సే ఒక వికెట్ తీశారు.
టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టుకు భారత బ్యాట్స్మెన్ ధీటుగా సమాధానం చెప్పారు.
ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ టెస్టు ఆరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ డక్ అవుట్ కావడం విశేషం. జూన్ 20న రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీలు కూడా తమ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ను ఆరంగేట్రం చేశారు. ఆ దిగ్గజాల సరసన సాయి సుదర్శన్ నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
మరోవైపు 3005 రోజుల తర్వాత భారత క్రికెట్ జట్టులోకి తిరిగి చోటు సంపాదించుకున్న కరణ్ నాయర్. ఇలా అత్యధిక రోజుల తర్వాత తిరిగి జట్టులోకి చోటు సంపాదించుకున్న ఐదవ భారత క్రికెటర్ గా కరణ్ నాయర్ నిలిచారు.
రిషభ్ పంత్ 76 ఇన్నింగ్స్ లలో 3000 టెస్టు రన్స్ ను పూర్తి చేసుకున్నాడు. కీపర్ లలో ఆడం గిల్ క్రిస్ట్ మాత్రమే 63 ఇన్నింగ్స్ లో 3000 పరుగులు పూర్తిచేసి రిసబ్ పంత్ కంటే ముందున్నాడు.
టెస్ట్ కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్ లలో శుభమన్ గిల్ నాలుగో వాడు. విజయ్ హజారే , సునీల్ గవాస్కర్ , విరాట్ కోహ్లీ లు ముందున్శారు
సంక్షిప్త స్కోర్
భారత్ మొదటి ఇన్నింగ్స్ – 359/3
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్