BIKKI NEWS (JULY 01) : INDIA BUNKER BUSTER BOMB. భారతదేశ తన అగ్ని 5 ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ కు బంకర్ బస్టర్ బాంబులను మోసుకెళ్లి సామర్ధ్యాన్ని కల్పించనుంది.
INDIA BUNKER BUSTER BOMB
దీని సహాయంతో భూమి లోపలికి 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోయోలా ఈ బంకర్ బ్లాస్టర్ బాంబును తయారు చేస్తున్నారు.
అవసరమైతే శత్రువు భూగర్భ అణు కేంద్రాలను భూస్థాపితం చేయాల్సిందేనని ఇరాన్ ఉదాంతం నుంచి పాఠాలు నేర్చుకున్న తరుణంలో భారత్ ఈ బంకర్ బస్టర్ బాంబులను తయారు చేయనుంది.
అగ్ని – 5 క్షిపణి గరిష్టంగా 5,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని చేదిస్తుంది. అయితే దూరం కంటే కూడా అత్యంత బరువులు మోయగలిగేలా నూతన అగ్ని -5 వెర్షన్ ను సిద్ధం చేస్తున్నారు.
తొలుత గరిష్టంగా 7,500 కిలోల బరువైన బంకర్ బస్టర్ బాంబుల.ను మోసుకెళ్లేలా తయారు చేస్తున్నారు .
బంకర్ బస్టర్ బాంబులు ఎంత వేగంతో భూమ్మీద పడితే అంత లోతుకు వెళ్లగలవు. అందుకే అత్యధిక హైపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్లేలా ఈ బాంబులను తయారు చేస్తున్నారు. వీటిని మ్యాక్ 20 వేగంతో ప్రయాణించేలా, మ్యాక్ 8 వేగంతో భూగర్భ లక్ష్యాన్ని ఛిద్రం చేసేలా డిజైన్ చేస్తున్నారు
- GOLD RATE – భారీగా పెరిగిన బంగారం
- INDIA BUNKER BUSTER BOMB – భారత బంకర్ బ్లస్టర్
- INDIAN MISSILES LIST : భారతీయ క్షిపణి వ్యవస్థ
- AGNI MISSILES : పూర్తి సమాచారం
- INDIAN MISSILES : భారత క్షిపణులు వాటి పరిధి