Home > 6 GUARANTEE SCHEMES > 6 గ్యారెంటీలకు ఆదాయం, క్యాస్ట్ సర్టిఫికెట్ లు అవసరమా.?

6 గ్యారెంటీలకు ఆదాయం, క్యాస్ట్ సర్టిఫికెట్ లు అవసరమా.?

BIKKI NEWS (DEC. 29) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దరఖాస్తుదారులకు ఆదాయయ దృవీకరణ పత్రం మరియు కుల దృవీకరణ పత్రాలు సమర్పించాలా, వద్దా.? (Income and caste certificates in 6 guarantee schemes) అనే సందేహము ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ దీనిపైన స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలు ఏమీ అవసరం లేదని, పరిశీలన సమయంలో అధికారులు చూసుకుంటారని తెలిపారు. కాబట్టి ప్రజలు ఎవరు ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం వేచి చేయకుండా, వెంటనే ఆధార్ కార్డు, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.