Home > EDUCATION > INTERMEDIATE > ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచండి – ఆర్జేడీ శ్రీమతి జయప్రద భాయ్

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచండి – ఆర్జేడీ శ్రీమతి జయప్రద భాయ్

  • TGJLA 475 అసోసియేషన్ నూతన సంవత్సర గోడ పత్రిక ఆవిష్కరణలో తెలంగాణ ఇంటర్ బోర్డు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీమతి జయప్రద భాయ్

BIKKI NEWS (JAN. 16) : Improve the attendance in govt junior colleges – says rjadie janapada bai. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి ప్రయత్నం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీమతి జయప్రద భాయ్ తెలిపారు.

Improve the attendance in govt junior colleges – says rjadie janapada bai

ఈరోజు తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ 475 రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరిస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హాజరు శాతం పెరిగినప్పుడు మాత్రమే ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని, ఉత్తీర్ణత శాతం పెంచడానికి అధ్యాపకులు, అధికారులందరూ కృషి చేద్దామని తెలియజేశారు.

రాబోవు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను, వార్షిక పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించడానికి అధ్యాపకులందరూ సహకరించాలని కోరారు.

రాబోవు ప్రాక్టికల్ & వార్షిక పరీక్ష నిర్వహణలో తప్పనిసరిగా తమ వంతు సహకరిస్తామని TGJLA_475 సంఘం తరఫున కొప్పిశెట్టి సురేష్ తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ – 475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్ధన్, పూర్ణచందర్ , మహిళా కార్యదర్శి సంగీత, షాహినా బేగం, రాష్ట్ర, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, కర్ని శ్రీనివాస్, ప్రవీణ్, వెంకటేశం, లావణ్య తదితరులు పాల్గొన్నారు

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు