WTC FINAL 2023 : విశ్వ విజేత ఆస్ట్రేలియా

  • తొమ్మిదో ఐసీసీ టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
  • అన్ని ఐసీసీ ఫార్మాట్ టోర్నీలలో విజేతగా నిలిచిన తొలి జట్టు ఆస్ట్రేలియా

లండన్ – ఓవల్ (జూన్ – 11) : World Test Championship Final – 2023 ఆస్ట్రేలియా జగజ్జేతగా నిలిచింది. ఐదో రోజు భారత బ్యాట్స్‌మన్ విఫలమవడంతో ఆస్ట్రేలియా సునాయాసంగా గెలిచింది. క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ, అజింక్యా రహనే మీద భారీ అంచనాలు ఉన్నపటికి వారు విఫలమవడంతో మ్యాచ్ మొదటి సెషన్ లోనే ఆస్ట్రేలియా చేతులలోకి పూర్తిగా వెళ్ళింది. 209 పరుగుల తేడాతో భారత్ ఘోర పరాజయం చెందింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ట్రావిస్ హెడ్ నిలిచారు.

ఆస్ట్రేలియాకు ఇది 9 ఐసీసీ టైటిల్… వన్డే ప్రపంచ కప్ 5 సార్లు, టీట్వంటీ వరల్డ్ కప్ 1 సారి, ఛాంపియన్స్ ట్రోపీ – 2 సార్లు, టెస్ట్ ఛాంపియన్స్ షిప్ – 1 సారి గెలుచుకుంది. అలాగే ఐసీసీ నిర్వహించే అన్ని ఫార్మాట్ లలోని ట్రోపీలను నెగ్గిన మొదటి జట్టు గా ఆస్ట్రేలియా నిలిచింది.

WTC 2023 CHAMPION AUSTRALIA నిలిచింది. భారత్ మరోసారి ఐసీసీ ఫైనల్ లో ఓటమి చెంది గత పది సంవత్సరాలుగా ఐసీసీ ట్రోపీలలో నాకౌట్ లలో ఓటమి చెందుతున్న అనవాయితీ ని కొనసాగించింది. 2021 లో న్యూజిలాండ్ చేతిలో ఇప్పుడు ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది.

గత ఎనిమిది ఐసీసీ టోర్నమెంట్‌లలో భారత్ సెమీస్, ఫైనల్ చేరినప్పటికి ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.