ICC WORLD CUP SEMI FINALS

హైదరాబాద్ (నవంబర్ – 12) : ICC WORLD CUP 2023- SEMI FINALS కు ఇండియా న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్లు చేరాయి. ఆస్ట్రేలియా – 5 సార్లు, ఇండియా – 2 సార్లు ప్రపంచ కప్ గెలుచుకున్నాయి. న్యూజిలాండ్, సౌతాప్రికా ఇంతవరకు వన్డే ప్రపంచ కప్ గెలుచుకోలేదు. ఈ నాలుగు జట్లు సెమిస్ లో తలపడనున్నాయి. నవంబర్ – 19 న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇండియా – న్యూజిలాండ్ మధ్య మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ నవంబర్ – 15న ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. 2011 లో భారత్ ఇక్కడే తన రెండో ప్రపంచ కప్ ను గెలుచుకుంది. అయితే 2019 లో న్యూజిలాండ్ పై సెమీఫైనల్ లో ఓటమి పాలైంది. మరి ఆ మ్యాచ్ ను ప్రతీకారం తీర్చుకుని ఫైనల్ కు చేరుతుందో లేదో చూడాలి.

అలాగే 2019 ప్రపంచ ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి చెందిన న్యూజిలాండ్ ఈసారి తన మొదటి ప్రపంచ కప్ ను గెలుచుకుంటుందో లేదో చూడాలి.

రెండో సెమీఫైనల్ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కోల్‌కతా – ఈడేన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 16న జరగనుంది. ఇప్పటికే 5 సార్లు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా 6 వ టైటిల్ పై కన్నేసింది. సెమీఫైనల్ గండం ఉన్న సౌతాప్రికా ఈసారి ఆ గండం దాటి ఫైనల్ చేరి తన మొదటి ప్రపంచ కప్ ను ముద్దాడుతుందో లేదో చూడాలి.