Home > LATEST NEWS > HYDRAA > HYDRAA – హైడ్రా ఏర్పాటుకు ముందు కట్టిన ఇళ్లను కూల్చం – రంగనాథ్‌

HYDRAA – హైడ్రా ఏర్పాటుకు ముందు కట్టిన ఇళ్లను కూల్చం – రంగనాథ్‌

BIKKI NEWS (DEC. 18) : Hydraa act effect from July 2024 only. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో 2024 జులై కంటే మందు నిర్మించిన ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్పష్టం చేశారు.

Hydraa act effect from July 2024 only

అంటే హైడ్రా ఏర్పాటుకన్నా ముందు నిర్మించి, ప్రజలు నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చొద్దని నిర్ణయించామని ప్రకటించారు. వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న నిర్మాణాలపై మాత్రం వేటు తప్పదన్నారు.

రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ ‘‘పేదలను నష్టపరిచే చర్యలను హైడ్రా తీసుకోదు. 2024 జులైలో హైడ్రా ఏర్పాటైంది. అంతకు ముందు కట్టుకున్న నిర్మాణాలపై చర్యలు తీసుకోం. గతంలో అనుమతులు తీసుకుని ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనాలపైనా చర్యలుండవని స్పష్టం చేశారు.

అయితే 2024 జులై తర్వాత అనుమతులు తీసుకొని, చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల్లో చేపట్టే నిర్మాణాలను మాత్రం కూల్చేస్తాం’’అని స్పష్టం చేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు