HURUN RICH LIST 2023 : 2023 ధనవంతుల జాబితా

  • ప్రపంచ కుబేరుడు బెర్నార్డ్ అర్నాల్ట్ (202 బిలియన్ డాలర్లు)
  • భారత కుబేరుడు ముకేశ్ అంబానీ (82 బి. డా.)

హైదరాబాద్ (మార్చి – 23) : ప్రపంచ ధనవంతుల జాబితాను HURUN M3M GLOBAL RICH LIST 2023 పేరుతో విడుదల చేసింది.

LVMH గ్రూప్ చైర్మన్ బెర్నార్డ్ అర్నాల్ట్ (202 బిలియన్ డాలర్లు) ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచాడు. టెస్లా చైర్మన్ ఎలన్ మస్క్ రెండు, హెర్మిర్ గ్రూప్ యొక్క బెర్ట్రాండ్ ప్యుచ్ & ఫ్యామిలీ మూడో స్థానంలో నిలిచారు.

భారత్ మరియు ఆసియా నుంచి ముఖేష్ అంబానీ (82 బిలియన్ డాలర్లు) ఒక్కడే 9వ స్థానంలో నిలిచి టాప్ 10 లో చోటు దక్కించుకున్నాడు. ఇంతకుముందు సంవత్సరం ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ త్రీ లో చోటు సంపాదించుకున్న గౌతమ్ ఆదాని (53 బిలియన్ డాలర్లు )హిండెన్ బర్గ్ నివేదిక కారణంగా టాప్ 20 లో కూడా చోటు కోల్పోయి 23వ స్థానంలో నిలిచాడు.

★ టాప్ టెన్ ప్రపంచ కుబేరులు :

1). బెర్నార్డ్ అర్నాల్ట్
2). ఎలన్ మస్క్
3). బెర్ట్రాండ్ ప్యుచ్ & ఫ్యామిలీ
4). జెఫ్ బెజోస్
5). వారెన్ బఫెట్
6). బిల్ గేట్స్
7). స్టీవ్ బాల్మర్
8). ల్యారీ ఎలిసన్
9). ముకేష్ అంబానీ
10). ప్రాంకోయిస్ బెటన్‌కోర్ట్ మేయర్

★ టాప్ టెన్ భారత కుబేరులు :

1). ముకేష్ అంబానీ (9)
2). గౌతమ్ అదాని & ఫ్యామిలీ (23)
3). సైనస్ పూనావాలా (46)
4). శివ నాడర్ & ఫ్యామిలీ (50)
5). లక్ష్మీ ఎన్. మిట్టల్ (76)
6). ఎస్.పి. హిందూజా & ఫ్యామిలీ (76)
7). దిలీప్ సింఘ్వీ & ఫ్యామిలీ (98)
8). రాధకిషన్ దమాని & ఫ్యామిలీ (107)
9). కుమార మంగళం బిర్లా & ఫ్యామిలీ (135)
10). ఉదయ్ కోటక్ (135)