CURRENT AFFAIRS IN TELUGU 23rd MARCH 2023

CURRENT AFFAIRS IN TELUGU 23rd MARCH 2023

1) అస్సాంలో జరుగుతున్న ఆసియా ఖో ఖో ఛాంపియన్షిప్ 2023 పోటీలలో విజేతలుగా నిలిచిన జట్లు ఏవి.?
జ : భారత్ మహిళలు మరియు పురుషుల జట్లు

2) అంతర్జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ కు జరిగిన భారత బాక్సర్లు ఎవరు.?
జ : నిఖత్ జరీన్, నీతూ గంగాస్, సవిటీ, లవ్లీనా.

3) ఇటీవల జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సూర్యుడు చుట్టూ ఒకసారి తిరగటానికి పదివేల సంవత్సరాలు పట్టే ఒక నూతన గ్రహాన్ని కనిపెట్టింది దానికి ఏమని పేరు పెట్టారు.?
జ : VHS 1256 B

4) ముస్లిం సమాజంలో ఏ విధానాలపై రాజ్యాంగ ధర్మాస్నాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.?
జ : బహు భార్యత్వము & నిఖా హలాల

5) కుల వివక్షకు వ్యతిరేకంగా అమెరికాలోని ఏ రాష్ట్ర సెనేట్ లో బిల్లు ప్రవేశపెట్టారు.?
జ : కాలిఫోర్నియా

6) ఏ దేశం టూరిస్ట్ వీసాలతో ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ప్రకటించింది.?
జ : అమెరికా

7) ఎల్ ఐ సి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : సిద్ధార్థ్ మెహంతి

8) 2021 – 22 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి ?
జ : 76,568 కోట్లు

9) పార్లమెంటేరియన్స్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ అవార్డు 2021- 22 కు అందుకున్న రాజ్యసభ సభ్యుడు ఎవరు.?
జ : లింగయ్య యాదవ్ (తెలంగాణ)

10) దేశంలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనాకు కారణమైన వేరియెంట్ ఏదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.?
జ : XBB – 1.16

11) ఇటీవల భారత వైమానిక దళ అభివృద్ధికోసం రక్షణ శాఖ BEL సంస్థ తో కుదుర్చుకున్న ఒప్పందం విలువ ఎంత.?
జ : 3,750 కోట్లు

12) అమెరికాలో స్టార్టప్ కంపెనీ ప్రయోగించిన త్రీడీ ముద్రిత రాకెట్ విఫలమైంది ఆ రాకెట్ పేరు ఏమిటి.?
జ : టెర్రాన్

13) G20 సమావేశాలలో భాగంగా బిజినెస్ – 20 సమావేశాలకు ఆతిధ్యం ఇస్తున్న నగరం ఏది.?
జ : గ్యాంగ్ టక్

14) నేపాల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎవరు ఎన్నికయ్యారు ?
జ : రామ్ సహయ ప్రసాద్ యాదవ్

15) గత 30 ఏళ్లలో మొట్టమొదటిసారి పోలియో కేసులు ఏ దేశంలో గుర్తించబడ్డాయి.?
జ : బురుండి

16) అంతర్జాతీయ జల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : మార్చి 22