HURUN INDIA RICH LIST 2024 – అపర కుబేరుడు అదాని

BIKKI NEWS (AUG. 30) : HURUN INDIA RICH LIST 2024. హురూన్‌ ఇండియా విడుదల చేసిన సంపన్న వర్గాల జాబితా 2024లో గౌతమ్ అదాని మొదటి స్థానంలో నిలిచాడు.

HURUN INDIA RICH LIST 2024

ప్రస్తుత సంవత్సరానికిగాను తన సంపద 95 శాతం పెరిగి రూ.11.6 లక్షల కోట్లతో దేశీయ శ్రీమంతుల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు.

ముకేశ్‌ అంబానీ సంపద 25 శాతం పెరిగి రూ.10.14 లక్షల కోట్లుగా నమోదైంది. దీంతో అంబానీ రెండో స్థానంలో నిలిచాడు.

రూ.3.14 లక్షల కోట్లతో హెచ్‌సీఎల్‌ ఫౌండర్‌ శివ్‌ నాడర్‌ మూడో స్థానంలో, రూ.2.89 లక్షల కోట్లతో సైరస్‌ పూనావాల నాలుగో స్థానంలో, రూ.2.50 లక్షల కోట్ల సంపదతో దిలీప్‌ సంఘ్వీ ఐదో స్థానం నిలిచారు.

గతేడాది భారత్‌లో ప్రతి 5 రోజులకొక బిలయనీరు తయారైనట్లు నివేదిక వెల్లడించింది.

రూ.7,300 కోట్ల సంపదతో బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ తొలిసారిగా ఈ జాబితాలో చోటు లభించింది.

అతి పిన్న వయస్సు కలిగిన జెప్టో కో-ఫౌండర్‌ కైవల్య వొహ్రా తొలిసారిగా చోటు సంపాదించుకున్నారు. రూ.3,600 కోట్ల సంపద కలిగివున్నారు.

రూ.1,000 కోట్ల కంటే అధిక ఆస్తి కలిగిన వారు కొత్తగా 220 మంది జతవడంతో మొత్తం సంఖ్య 1,539కి చేరుకున్నారు.

హైదరాబాద్ మూడో స్థానం

హైదరాబాద్‌ మరో ఘనతను సాధించింది. నగరాల వారీగా శ్రీమంతులు జాబితాలో తొలిసారిగా బెంగళూరును అధిగమించి హైదరాబాద్‌ మూడో స్థానం దక్కించుకున్నది.

386 మందితో ముంబై ఎప్పటిలాగే తొలి స్థానంలో నిలువగా, 217 మందితో న్యూఢిల్లీ ఆ తర్వాతి స్థానం వరించింది. హైదరాబాద్ నుంచి 104 మంది కుబేరులు ఉన్నారు.

భారత కుబేరులు

1) గౌతమ్ అదాని
2) ముఖేష్ అంబానీ
3) శివ నాడార్
4) సైరస్ పూనావాలా
5) దిలీప్ సింఘ్వీ

తెలుగు కుబేరులు

1) మురళి దివీస్ (దివీస్)
2) పీ పిచ్చి రెడ్డి (మెఘా)
3) పీవీ కృష్ణా రెడ్డి (మెఘా)
4) జీఎం రావు (జీఎమ్మార్)
5) పీవీ రాంప్రసాద్ రెడ్డి (అరబిందో)
6) బండి పార్దసారధి రెడ్డి (హెటిరో)
7) ప్రతాప్ రెడ్డి (అపోలో)

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు