HURUN INDIA RICH LIST 2023 : కుబేరుడు అంబానీ

హైదరాబాద్ (అక్టోబర్ – 10) : 360 ONE Wealth Guru india rich list 2023 నివేదికను హురూన్ సంస్థ ప్రకటించింది. ఈ నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ (8.08 లక్షల కోట్లు) భారతదేశం లో అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. గౌతమ్ అదానీ (4.74 లక్షల కోట్లు) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో సైరన్ పూనావాలా (2.78 లక్షల కోట్లు) ఉన్నాడు.

ఆగస్టు – 30 – 2023 వరకు సేకరించిన వివరాల ఆధారంగా నివేదికను హురూన్ సంస్థ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 1,319 మంది ధనవంతుల పేర్లను ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 259 మంది బిలినియర్స్ ఉన్నారు. మహిళల ప్రకారం చూస్తే జోహో కంపెనీ అధినేత్రి రాధా వెంబు అత్యంత ధనవంతురాలిగా ఈ జాబితాలో నిలిచింది.

HURUN TOP 10 RICH PERSONS

1) ముఖేష్ అంబానీ
2) గౌతమ్ అదానీ
3) సైరన్ పూనావాలా
4) శివ నాడార్
5) గోపిచంద్ హిందూజా
6) దిలీప్ సింఘ్వీ
7) లక్ష్మీ నివాస్ మిట్టల్
8) రాధాకృష్ణన్ దామనీ
9) కుమార్ మంగళం బిర్లా
10) నీరజ్ బజాజ్

అత్యధిక ధనవంతులు గల నగరాలు

1) ముంబై – 328
2) డిల్లీ – 199
3) బెంగళూరు – 100