హైదరాబాద్ (నవంబర్ – 12) : HUMANOID ROBOT MIKA APPOINTED AS C.E.O. OF DICTADOR COMPANY. మైకా అనే హ్యూమనాయిడ్ రోబో కొలంబియాలోని కార్టాజీనా ప్రాంతంలో స్పిరిట్ తయారీ సంస్థ అయిన ‘డిక్టాటార్’ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా నియమించిన మొట్టమొదటి కంపెనీగా నిలిచింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (AI) తో టెక్కిలా ఉద్యోగాల పై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక రోబో ను ఏకంగా కంపెనీ సీఈఓ గా నియామకం కావడం చర్చనీయాంశం అయింది.
ఆర్టిపిసిఎల్ ఇంటిలిజెన్స్ మరియు రోబో (AI & ROBOTS) కలయిక భవిష్యత్తు టెక్నాలజీ రూపురేఖలను మారుస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వచ్చే ఐదు ఏళ్లలోనే వీటి ప్రభావం ఉద్యోగాలపై, మానవ జీవనశైళి పై తీవ్రంగా పడనుంది.
ఇప్పటికే చాట్ జిపిటి (Chat Gpt) అంటే చాట్ బాట్ పదిమంది చేయాల్సిన పనిని చాలా సునాయాసంగా చేస్తుండటం, రోజులు పట్టే పనిని నిమిషాల్లో చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం.
రోబో & ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కలయిక మానవ మనుగడకే ప్రమాదకరం కానుంది అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే ప్రభుత్వాలు వీటి వినియోగంపై నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉంది.