మానవ శరీరం – ఆసక్తికర అంశాలు

BIKKI NEWS : పోటీ పరీక్షల నేపథ్యంలో మానవ శరీరంలో అతి చిన్నవి, అతి పెద్దవి మరియు వివిధ అంశాలను చూద్దాం…. (Human Body facts sheet)

శరీరంలో అతి చిన్న ఎముక :- చెవి ఎముక(స్టెపిస్)

శరీరంలో అతి పెద్ద ఎముక :- తొడ ఎముక (ఫెమర్)

శరీరంలో అతి పెద్ద అవయవం : చర్మం

ముఖంలో ఎముకల సంఖ్య :- 14

సాధారణ రక్తపోటు :- 120/80

నిమిషానికి తీసుకునే శ్వాస :- 18 సార్లు

నిమిషానికి గుండె కొట్టుకునేది :- 72 సార్లు

మానవ శరీరం మొత్తంలో రక్తం బరువు :- 7 శాతం

క్రోమోజోముల సంఖ్య :- 23 జతలు

సాధారణ శరీర ఉష్ణోగ్రత :- (36.8°c) 98.4 ఫారన్‌హీట్

విశ్వదాత అయిన బ్లడ్ గ్రూప్ :- O గ్రూప్

విశ్వ గ్రహీత అయిన బ్లడ్ గ్రూపులు :- A.B

మెదడు దాదాపు 75 శాతం నీటితో నిర్మితమవుతుంది.

మూత్రపిండాలు నిమిషానికి 1.3 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రోజుకు దాదాపు 1.4 లీటర్ల మూత్రాన్ని విడుదల చేస్తాయి.

శరీరంలోని 20 శాతం రక్తాన్ని, ఆక్సీజన్ ను మెదడు వాడుకుంటుంది.

పురుషుల్లో దాదాపు 5.6 లీటర్ల రక్తం ఉంటే.. స్త్రీలలో 4.5 లీటర్లు ఉంటుంది.

కళ్లు మూసుకోకుండా తుమ్మటం అసాధ్యం.

మానవ కపాలంలో 22 ఎముకలుంటాయి.

శరీరంలో పక్కటెముకలు 24.

30 ఏళ్ల వయసు వచ్చే నాటికి మనిషి శరీరంలో 206 ఎముకలుంటాయి.