BIKKI NEWS (MAY 01) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ లకు సమాంతర రిజర్వేషన్లు (horizontal reservation for filling up of jobs by tspsc) అమలు చేయాలని నిర్ణయించినట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
తాజాగా లైబ్రేరియన్ పోస్టులు, అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగాల భర్తీకి సమాంతర రిజర్వేషన్లు ప్రకారం పోస్టులను కేటాయింపు చేయడం జరిగింది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 3 ప్రకారం దాదాపు అన్ని నోటిఫికేషన్లకు మహిళా సమాంతర రిజర్వేషన్లు వర్తింపజేసే విధంగా చర్యలు తీసుకొన్నట్టు పేర్కొన్నారు.