BIKKI NEWS : 15వ హాకీ వరల్డ్ కప్ – 2023 కు ఒడిశా రాష్ట్రం (భువనేశ్వర్, రూర్కేలా నగరాలు) ఆతిధ్యం ఇస్తుంది. ఈసారి 16 దేశాలు నాలుగు గ్రూప్ లుగా టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.
కటక్ లో జరిగిన హాకీ ప్రపంచ కప్ ప్రారంభోత్సవ వేడుకలను నవీన్ పట్నాయక్ ఆరంభించారు.
జనవరి 13 నుండి 29 వరకు ఈ టోర్నీ జరగనుంది.
ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ (FIH) ఈ టోర్నీ ని 1971 నుండి నిర్వహిస్తుంది.
హాకీ వరల్డ్ కప్ – 2022 యొక్క మస్కట్ “ఒల్లీ” – ఒల్లీ అనేది ఒలివా రైడ్లీ టర్టీల్ – ఈ తాబేలు ఒడిశా తీర ప్రాంతంలో మరియు గహీర్‌మాతా మెరైన్ శాంక్చురి లలో కనబడుతుంది..
2017 లో ఒడిశా ప్రభుత్వం ఈ తాబేలు ను గుర్తించిన తర్వాత ఇక నుండి ఒడిశాలో జరిగే అన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నీల్లో “ఒల్లీ” ని శాశ్వత మస్కట్ గా ప్రకటించింది.
హాకీ వరల్డ్ కప్ గేయం ‘హాకీ హై దిల్ మేరా’
ప్రఖ్యాత సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ ప్రపంచంలో అతిపెద్ద హకీ స్టిక్ సైకత శిల్పాన్ని (105 అడుగుల) ఇసుకతో చేశాడు.
భారత్ హాకీ వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వడం ఇది నాలుగోసారి (1982, 2010, 2018, 2023).
16వ హకీ వరల్డ్ కప్ 2026 ను బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నారు.
1971లో మొదటి వరల్డ్ కప్ ను పాకిస్థాన్ గెలుచుకుంది.
పాకిస్థాన్ మొత్తంగా అత్యధికంగా 4 సార్లు 1971, 1978, 1982, 1994లలో టైటిల్ సాదించి అగ్రస్థానంలో ఉంది.
1975 లో మూడో వరల్డ్ కప్ ను భారత్ పాకిస్థాన్ పై గెలుచుకుంది.
2018లో జరిగిన 14వ వరల్డ్ కప్ ను బెల్జియం గెలుచుకుని డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉంది.
ఇప్పటివరకు పాకిస్థాన్ 4 సార్లు, ఆస్ట్రేలియా 3 సార్లు, నెదర్లాండ్స్ 3 సార్లు, జర్మనీ 2 సార్లు, భారత్, బెల్జియం ఒక్కసారి విజేతలుగా నిలిచాయి.
★ విజేతల జాబితా :
1) 1971 – పాకిస్థాన్
2) 1973 – నెదర్లాండ్స్
3) 1975 – ఇండియా
4) 1978 – పాకిస్థాన్
5) 1982 – పాకిస్థాన్
6) 1986 – ఆస్ట్రేలియా
7) 1990 – నెదర్లాండ్స్
8) 1994 – పాకిస్థాన్
9) 1998 – నెదర్లాండ్స్
10) 2002 – జర్మనీ
11) 2006 – జర్మనీ
12) 2010 – ఆస్ట్రేలియా
13) 2014 – ఆస్ట్రేలియా
14) 2018 – బెల్జియం
15) 2023 –