Home > JOBS > TGPSC > Group – 1 : గ్రూప్ – 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు

Group – 1 : గ్రూప్ – 1 నియామకాలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు

BIKKI NEWS (APR. 18) : High Court orders suspension of Group-1 recruitments. తెలంగాణ రాష్ట్ర గ్రూప్- 1 నియామకాలను తమ ఉత్తర్వుల ప్రకారం భర్తీ చేయాలని అప్పటివరకు నియామక ప్రక్రియ నిలిపివేయాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది.

High Court orders suspension of Group-1 recruitments

మెయిన్స్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయి అంటూ దాకలైన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తదుపరి విచారణ 28వ తేదీకి వాయిదా వేసింది.

అయితే ప్రస్తుతం జరుగుతున్న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగించవచ్చని తుది నియామకాలు మాత్రం తమ తీర్పుకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది.

563 గ్రూప్ – 1 ఉద్యోగాల భర్తీ కోసం మెయిన్స్ ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1:1 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు