BIKKI NEWS (DEC. 27) : High court dismiss petitions on TGPSC GROUP 1. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు గ్రూప్-1 నియామకాలపై గత ఫిబ్రవరిలో జారీచేసిన నోటిఫికేషన్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది.
High court dismiss petitions on TGPSC GROUP 1
గ్రూప్-1 నోటిఫికేషన్, దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 29ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేసింది.
దివ్యాంగుల రిజర్వేషన్ల నిబంధనలను సవరిస్తూ 2018లో జారీచేసిన జీవో 10, 2019లో జారీచేసిన జీవో 96, ఈ ఏడాది వెలువడిన జీవో 29ని సవాల్ చేస్తూ ఏడు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని కొట్టివేస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ జీ రాధారాణితో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.
నోటిఫికేషన్ వెలువడ్డాక కోర్టును ఆశ్రయించడంలో సుదీర్ఘ జాప్యం జరిగిందని తప్పుబట్టింది. జాప్యానికి కారణాలను వివరించలేదని ఆక్షేపించింది. పిటిషనర్లు, ప్రభుత్వ వాదనల తర్వాత హైకోర్టు తీర్పును వెలువరిస్తూ.. ‘2022లో వెలువడిన నోటిఫికేషన్ మేరకు నిర్వహించిన ప్రిలిమ్స్ రద్దయిందని, దీంతో గత ఫిబ్రవరి 19న 563 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిందని గుర్తుచేసింది. గత జులై 7న తుది కీ వెలువడిందని, మెరిట్ జాబితా వెలువడ్డాయక పిటిషనర్లు కోర్టుకు వచ్చారని తప్పుబట్టింది. జీవో 29ని అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకపోవడం వల్ల ఆలస్యమైందన్న పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యంగా లేదని పేర్కొన్నది. ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ అయ్యాక సమాచార హక్కు చట్టం కింద జీవో కాపీని పొందేందుకు పిటిషనర్లు ప్రయత్నాలు చేయలేదని తప్పుబట్టింది.
గత నోటిఫికేషన్ మేరకు పరీక్ష నిర్వహించాలనే పిటిషన్లను గతంలోనే హైకోర్టు కొట్టేసిందని గుర్తుచేసింది. ప్రిలిమ్స్ రద్దు చేసి పాత నోటిఫికేషన్ మేరకు నిర్వహించాలనే పిటిషనర్ల వాదన ఆమోదయోగ్యం కాదని, అందుకే పిటిషన్లను కొట్టేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది.
తమ తీర్పులో వెబ్‌నోట్, డీకోడింగ్ వెబ్‌నోట్ అంశాల జోలికి వెళ్లలేదని, దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తదనంతర పరిణామాలపై పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్