Home > UNCATEGORY > జీజేసీ గీసుగోండలో హెల్ప్ కార్యక్రమం

జీజేసీ గీసుగోండలో హెల్ప్ కార్యక్రమం

BIKKI NEWS (JAN. 03) : HELP programme in GJC GEESUGONDA. మండల కేంద్రంలో గల గీసుగోండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మరియు హెల్ప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు భావోద్వేగాల నియంత్రణ మరియు ధ్యానము ద్వారా ఏకాగ్రత పెంపొందించుకొనుట ఎలా అనే అంశంపై కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

HELP programme in GJC GEESUGONDA

ఈ కార్యక్రమంలో హెల్ప్ ఆర్గనైజేషన్ నోడల్ కోఆర్డినేటర్ కే. విజయభాస్కర్ మాట్లాడుతూ… మనసు నియంత్రణ చేసుకుని, భాగోద్వేగాలను అదుపు చేయడం ద్వారా లక్ష్యసాధన దిశగా ప్రయాణించాలని సూచించారు.

అసిస్టెంట్ కోఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ రోజు ధ్యానం కొనసాగించాలని తెలియజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సీహెచ్. రమణాకర్ మరియు హెల్ప్ కోఆర్డినేటర్ యన్. రాజ్‌కుమార్ మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు