BIKKI NEWS (JUNE 16) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ హస్పిటల్స్, వైద్య విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 755 వివిధ రకాల పోస్టులను భర్తీ (HEALTH DEPARTMENT JOBS IN TELANGANA) చేయనుంది. ఈమేరకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసి పోస్టులను భర్తీ చేయనుంది.
HEALTH DEPARTMENT JOBS IN TELANGANA
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకుగానూ త్వరలోనే 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు, 31 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్‌ఎస్ ఆర్‌బీ) ద్వారా, మరియు 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్, నోటిఫికేషన్ జారీ చేయనున్నాయి.