Home > TELANGANA > HEALTH CARDS FOR SHG – స్వయం సహయక సంఘ మహిళలకు హెల్త్ కార్డులు – సీఎం రేవంత్ రెడ్డి

HEALTH CARDS FOR SHG – స్వయం సహయక సంఘ మహిళలకు హెల్త్ కార్డులు – సీఎం రేవంత్ రెడ్డి

BIKKI NEWS (MAY 17) : health cards for self help group members in telangana. తెలంగాణ రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ఆరోగ్య భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన ఒక గుర్తింపు కార్డు జారీ చేసే విధానం అమలులోకి తేవాలని అధికారులకు సూచించారు. ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటా బేస్ తయారు చేసి అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని చెప్పారు.

health cards for self help group members in telangana

వి హబ్ (We Hub Hyderabad) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి గారు “విమెన్ యాక్సిలరేషన్ ప్రోగ్రాం”ను ప్రారంభించారు. కార్యక్రమం ఆవరణలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. మహిళా సంఘాలతో కలిసి పనిచేయడానికి సంబంధించి వివిధ సంస్థలకు మధ్య కుదిరిన అవగాహనా ఒప్పంద పత్రాలను ముఖ్యమంత్రి గారి సమక్షంలో మార్చుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో మహిళలను ప్రోత్సహించాలి. వారిని ఆర్థికంగా నిలబెట్టాలి. ఆర్థిక క్రమ శిక్షణతో ముందుకు వెళుతున్నారు. గడిచిన ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పించింది.

తెలంగాణ, వన్ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం సాధంచాలంటే రాష్ట్రంలో కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలి. ఆ లక్ష్య సాధనలో భాగంగానే మహిళలకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఒక్కో మహిళ నెలకు దాదాపు 5 వేల రూపాయల మేరకు ఆదా అయింది. ఆర్టీసీ కూడా లాభాల బాట పట్టింది.

ఆర్టీసీ ద్వారా నడుపుకోవడానికి మహిళా గ్రూపులకు ఇప్పటికే 150 బస్సులను కేటాయించాం. 600 బస్సులను వెంటనే తీసుకుని నడిపించాలి. అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని కేటాయిస్తాం.

రూ. 500 లకే సిలిండర్, పాఠశాలల నిర్వహణ మహిళా సంఘాలకే అప్పగించాం. పాఠాశాలల్లో విద్యార్థినీ విద్యార్థులకు 1 కోటి 30 లక్షల యూనిఫామ్ డ్రెస్సుల బాధ్యత కూడా వారికే అప్పగించాం. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మాత్రమే నిర్వహించే వ్యాపారాల్లో సైతం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తున్నాం.

ఆడపడుచులకు పెట్రోల్ బంకులు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాం. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి మహిళా సంఘాలను ప్రోత్సహించి రాష్ట్ర విద్యుత్ శాఖ ద్వారా ఒప్పందాలు చేస్తున్నాం. ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలున్న హైటెక్ సిటీ దగ్గరలో మూడున్నర ఎకరాల స్థలంలో మహిళా సంఘాల ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించాం.

ఇలా ప్రతి చోటా, ప్రతి సందర్భంలోనూ మహిళలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నాం. మహిళా శక్తిని ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యం. గతేడాది 20 వేల కోట్ల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు అందిస్తే ఒక్క రూపాయి కూడా ఎగవేయకుండా ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో తిరిగి చెల్లించారు.

స్వయం సహాయక సంఘాల (SHG సభ్యులకు ఇస్తున్న గుర్తింపు కార్డు స్థానంలో ఒక యూనిక్ ఐడీ కార్డు జారీ చేయడానికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాలి. ముఖ్యంగా మహిళలకు అవసరమైన హెల్త్ చెకప్ చేయించడం, హెల్త్ ప్రొఫైల్స్ తయారు చేయించడం, ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత సహాయం అందించడం కాదు. వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా సహాయం అందించవచ్చు.

పట్టణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున సభ్యులను మహిళా సంఘాల్లో చేర్పించాల్సిన అవసరం ఉంది. ఆడబిడ్డలు వ్యాపారాల్లో నిలదొక్కుకున్నప్పుడే కుటుంబాలు ఆర్థికంగా నిలబడుతాయి. 1967 లో చైనాతో, 1971 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగిన సందర్బంగా ఇందిరా గాంధీ గారు మహిళా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. మహిళా శక్తి అండగా ఉంటే దేశం అభివృద్ధి పథం వైపు నడుస్తుంది” అని సమావేశాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రఘువీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ రెడ్డి గారు, వీహబ్ ప్రతినిధులు, వివిధ సంస్థలు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు