BIKKI NEWS (JUNE 05) : Gurukula degree admissions 2025. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ సొసైటీ పరిధిలోని మహిళా డిగ్రీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
Gurukula degree admissions 2025.
సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాల వరంగల్ తూర్పు కళాశాలలో 2025 – 2026 విద్యాసంవత్సరానికై
అడ్మిషన్లు ప్రారంభం
తెలంగాణ గురుకుల మహిళ డిగ్రి వరంగల్ తూర్పు కళాశాలలో అడ్మిషన్ల ప్రారంభం గురించి వరంగల్ తూర్పు కళాశాల ప్రిన్సిపల్ డా॥ V. రాధిక తెలియజేస్తూ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ( TGSWRDCW) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న 28 టీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి డబ్ల్యూ మహిళ డిగ్రీ కళాశాలలో 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను బిఏ బీకాం బీఎస్సీ మొదటి సంవత్సరం డిగ్రీ కోర్సులలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశాల కోసం అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
డిగ్రీలో అడ్మిషన్ కోసం మహిళా అభ్యర్థులు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ లేదా ఇతర గుర్తింపు పొందిన బోర్డుల ద్వారా నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్ష 2025లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల అభ్యర్థుల వార్షిక ఆదాయం 1,50,000 కి మించ కూడదు ,పట్టణ ప్రాంతాల అభ్యర్థుల తల్లిదండ్రుల ఆదాయం రెండు లక్షలకు మించరాదు.
వరంగల్ తూర్పు డిగ్రి కళాశాలలోని గ్రూపుల వివరాలు
B.Sc (MPC)
B.Sc (MStCs)
B.Sc ( BZC )
B.Sc ( MbZC)
B.A ( H.E.P)
B.Com(Computer Applications )
B.com( Business Analytics)
పైన తెలిపిన గ్రూపులలో అడ్మిషన్ పొందుటకు
దరఖాస్తు పత్రాలను నాయుడు పెట్రోల్ పంప్ సమీపమందు గల వరంగల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో నేరుగా సమర్పించాలి. దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ 23/ 6/ 2025
దరఖాస్తు తో పాటు జత చేయవలసిన పత్రాలు
పదవ తరగతి మార్కుల మెమో
ఇంటర్ మార్కుల మెమో
1/1 2025 తర్వాత పొందిన తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రం
కుల ధ్రువీకరణ పత్రం
5 పాస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
పైన తెలిపిన గ్రూపులలో చేరుటకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా రావాలని వరంగల్ తూర్పు కళాశాల ప్రిన్సిపల్ డా॥ V. రాధిక తెలియజేసారు
సంప్రదించవలసిన నెంబర్లు
7995010683
7702676584
వెబ్సైట్ : https://tgswreis.telangana.gov.in/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్