Home > TELANGANA > FIRE ACCIDENT – గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం 17 మంది మృతి

FIRE ACCIDENT – గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం 17 మంది మృతి

BIKKI NEWS (MAY 18) : GULZAR HOUSE FIRE ACCIDENT. చార్మినార్‌ సమీపంలోని మీర్‌చౌక్‌ వద్ద గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 17కు పెరిగింది.

GULZAR HOUSE FIRE ACCIDENT

ఈరోజు తెల్లవారుజామున మీర్‌చౌక్‌లోని గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో 17 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపుచేశారు. గాయపడినవారిని వివిధ హాస్పిటళ్లకు తరలించారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మరణించగా, మిగిలినవారు హస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు.

హైదరాబాద్​ ఓల్డ్ సిటీ మీర్ చౌక్ లోని గుల్జార్‌ హౌస్‌ వద్ద జరిగిన అగ్నిప్రమాదం పై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని మంత్రి గారిని, ఉన్నతాధికారులను ఆదేశించారు.

పోలీస్​, ఫైర్​ విభాగం చేపడుతున్న చర్యలను ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.

స్థానిక కుటుంబాలతో కూడా ఫోన్ లో మాట్లాడిన ముఖ్యమంత్రి గారు బాధితులను కాపాడుతామని భరోసా ఇచ్చారు. దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఐజీ నాగిరెడ్డి గారిని ఆదేశించారు.

చార్మినార్ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మృతులకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
మృతులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు