Home > LATEST NEWS > విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసిన గెస్ట్ లెక్చరర్స్

విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసిన గెస్ట్ లెక్చరర్స్

BIKKI NEWS (OCT. 25) : guest lecturers meets akunuri murali. హైదరాబాద్ SCERT భవన్ లో బుధవారం రోజున గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ – 2152 స్టేట్ కమిటీ నిర్ణయం మేరకు అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చెరుకు దేవయ్య ఆధ్వర్యంలో వివిధ జిల్లాల నుండి 20 మంది గెస్ట్ లెక్చరర్స్ తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూను మురళి మరియు విద్య కమిషన్ మెంబర్లను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

guest lecturers meets akunuri murali

ఈ సందర్భంగా చైర్మన్ గారు గెస్ట్ లెక్చరర్స్ నియామకమైన విధానం, వారి గౌరవ వేతనం, సంవత్సర కాలంలో వారు పనిచేస్తున్న 8 నెలల కాలం, ఈ విధంగా సుమారు 45 నిమిషాల పాటు గెస్ట్ లెక్చరర్ పడుతున్న సాధక బాధకాలు ప్రశ్నల రూపంలో పూర్తిగా తెలుసుకున్నారు. తదనంతరం గౌరవ చైర్మన్ గారు మాట్లాడుతూ… ఇంటర్మీడియట్ వ్యవస్థలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన ఫలితాలు అందించడానికి త్వరలో మధ్యాహ్నం భోజనం కార్యక్రమం అమలు చేస్తామని అదేవిధంగా మీ గెస్ట్ లెక్చరర్ల బాధ పూర్తిగా మాకు అర్థమైందని మీరు MTS పొందడానికి పూర్తిగా అర్హులని ఇది వీలైనంత తొందరగా అమలులోకి తెద్దామని తెలుపుతూ తొందరగానే కమిషనర్ గారితో మాట్లాడి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తానని తెలియజేశారు.

ఈ సందర్భంగా విద్య కమిషన్ మెంబర్ గౌరవ వెంకటేష్ గారు కొత్తగా నియామకమైతున్న 1392 రెగ్యులర్ లెక్చరర్ నియామకం కాకముందే ఈ గెస్ట్ లెక్చరర్ లకు MTS వర్తించేటట్టు ప్రయత్నం చేద్దామని గౌరవ విద్యకమిషన్ చైర్మన్ ఆకునూరు మురళిని రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా మహిళా విద్యా కమిషన్ సభ్యురాలు మాట్లాడుతూ… ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందిస్తున్న మీకు నెలల పాటు జీతాలు పెండింగ్ లో ఉండడం కొన్ని నెలల వరకు మాత్రమే తక్కువ జీతాలతో కాలం గడపడం బాధాకరమని తెలియజేస్తూ నేను ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేటట్లు చూస్తానని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చెరుకు దేవయ్య తో పాటు సిద్దిపేట జిల్లా ట్రెజరర్ బి. చంద్రమోహన్, క్రియాశీలక సభ్యులు సంపత్ కుమార్, రేణుక, మౌనిక, ప్రవళిక, లిఖిత, శ్రీ జన్య, అరుణ, శ్రీదేవి, శ్రీనివాస్, జంగయ్య మరియు కరుణాకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు