Home > UNCATEGORY > గెస్ట్ లెక్చరర్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

గెస్ట్ లెక్చరర్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి

BIKKI NEWS (OCT. 05) : Guest lecturers job security issue. ఈ రోజు కోరుట్ల లో జరిగిన మాజీ మంత్రి కీర్తిశేషులు శ్రీ జువ్వాడి రత్నాకర్ గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును జగిత్యాల జిల్లా గెస్ట్ లెక్చరర్స్ జిల్లా అధ్యక్షులు గుర్రాల సాయికృష్ణ గారి అధ్వర్యంలో కలవడం జరిగింది.

Guest lecturers job security issue

ఈ సందర్భంగా వారికి విన్నవించిన వినతి పత్రంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా గెస్ట్ జూనియర్ లెక్చరర్ లకు 42,000/- జీతం మరియు 12 నెలల కన్సాలిడేటెడ్ పే ఇవ్వమని కోరడం జరిగింది. అదే విధంగా ఉద్యోగ భద్రత మరియు జిల్లాల్లో తగ్గిన పోస్ట్ లను మళ్ళీ యధావిధిగా పెంచాలని కోరడం జరిగింది.

ఈ అంశాల పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రి మీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారని సాయికృష్ణ తెలిపారు.

ఈ కార్యక్రమంలో శంకరయ్య, శిరీష, నాగేశ్వర్, రాజశేఖర్, అరుణ్, సుధీర్, వినీత, కావ్య పాల్గొన్నారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు