Home > JOBS > GUEST JOBS > GUEST JL JOBS – గెస్ట్ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు ప్రకటన

GUEST JL JOBS – గెస్ట్ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు ప్రకటన

BIKKI NEWS (MAY 28) : Guest Junior lecturer jobs in medak district. మెదక్ జిల్లాలో గెస్ట్ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ కొరకు ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మెదక్‌, తూప్రాన్‌, రామాయంపేట, కొల్చారంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికలు)లో ఈ ఖాళీలు కలవు.

Guest Junior lecturer jobs in medak district

ఖాళీల వివరాలు : తెలుగు, హిందీ, ఆంగ్లం, పీఈటీ, పీడీ, సివిక్స్‌, కామర్స్‌, భౌతిక, రసాయన, జువాలజీ, జీవశాస్త్రం, గణితం తదితర సబ్జెక్టుల్లో టీజీటీ, పీజీటీ, జూనియర్‌ లెక్చరర్ల పోస్టులు (మహిళలకు) ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఉపాధ్యాయ, అధ్యాపకుల ఖాళీల్లో పార్ట్‌టైం ప్రతిపాదికన పని చేసేందుకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

అర్హతలు : అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, బీఈడీ కలిగి కనీసం ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలని పేరొన్నారు.

దరఖాస్తు గడువు : ఆసక్తి గల అభ్యర్థులు అన్ని సర్టిఫికెట్ లతో మే 25 నుంచి 29వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.

ఎంపిక విధానం :అభ్యర్థులను మెరిట్‌, డెమో ఆధారంగా ఎంపిక చేస్తారని, డెమోలు ఈ నెల 31న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తామని సూచించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు