పాత ‘అతిథి’ అధ్యాపకులను కొనసాగించండి – హైకోర్టు

హైదరాబాద్ (జూలై – 21) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న 1,654 టీచింగ్ పోస్టులను నూతన అభ్యర్థుల చేత ‘అతిధి’ పద్ధతిలో భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్న నిర్ణయం పై రాష్ట్ర హైకోర్టు ఈరోజు మద్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటివరకు పనిచేస్తున్న అతిధి అధ్యాపకులనే ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని పేర్కొంది. ఈ కేసు మీద తదుపరి వాదనలు ఆగస్టు 21కి వాయిదా వేయడం జరిగింది.

ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ యాకుబ్ పాషా తమను ఈ విద్యా సంవత్సరం కూడా కొనసాగించాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు వాదనలు విన్న జస్టిస్ శ్రీమతి పి. మాధవి దేవి పాత అతిథి అధ్యాపకులను కొనసాగించాలని, పూర్తి ఖాళీలను ప్రస్తుత నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని మద్యంతర ఉత్తర్వులలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. మనీష్ గుప్తా వర్సెస్ ప్రెసిడెంట్‌, జాన్ భగీరథి సమితి కేసులో సుప్రీం కోర్ట్ ఇటీవల వెలువరించిన తీర్పు ప్రకారం ఒక తాత్కాలిక ఉద్యోగిని తొలగించి మరోసక తాత్కాలిక ఉద్యోగిని తీసుకోరాదు అనే తీర్పు ను ఉటంకించింది.