BIKKI NEWS (NOV. 19) : GSAT 20 MISSION SUCCESSFUL. ఇస్రోకు చెందిన జీశాట్-20 (జీశాట్-ఎన్2) ఉపగ్రహం స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్ – 9 ద్వారా విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ ఇందుకు వేదిక అయింది.
GSAT 20 MISSION SUCCESSFUL
4700 కేజీల బరువైన ఈ కమ్యూనికేషన్ ఉపగ్రహం అండమాన్ & నికోబార్, లక్షద్వీప్‌తో పాటు భారత్ మొత్తాన్ని కవర్ చేసి బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. అలాగే విమానాలలో వైపై సేవలను అందించడానికి ఉపయోగపడనుంది.
మొత్తం 14 సంవత్సరాల పాటు జీశాట్ 20 సేవలను అందించనుంది.