BIKKI NEWS (DEC. 15) : group 2 exams today and tomorrow. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేడు, రేపు గ్రూప్ – 2 పరీక్షలను నిర్వహించనుంది. ఈ మేరకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది.
group 2 exams today and tomorrow.
ఈ పరీక్షలు నాలుగు పేపర్లకు రాష్ట్ర వ్యాప్తంగా 1,368 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,51,847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 783 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రూప్-2 నోటిఫికేషన్‌ను జారీచేయగా, పలు కారణాలతో పరీక్ష నాలుగుసార్లు వాయిదాపడింది.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
5.51లక్షల మంది అభ్యర్థుల్లో ఇప్పటి వరకు కేవలం 77% మంది అభ్యర్థులు మాత్రమే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. లక్షకుపైగా అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోలేదు.
గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు ప్రతి సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతి అభ్యర్థి బయోమెట్రిక్ హాజరును నమోదుచేయాలని, లేదంటే జవాబుపత్రాన్ని తిరస్కరిస్తామని వెల్లడించారు.
- PM MODI AWARDS : నరేంద్ర మోదీని వరించిన పలు అవార్డులు
- INTER EXAMS – 7వ రోజు రిపోర్ట్
- Half Day School – పాఠశాలలకు ఒక్కపూట బడులు
- INTER EXAMS QP SET – 13th March 2025
- GK BITS IN TELUGU MARCH 13th