Home > CURRENT AFFAIRS > AWARDS > Green Nobel – భారతీయునికి గ్రీన్ నోబెల్

Green Nobel – భారతీయునికి గ్రీన్ నోబెల్

BIKKI NEWS (APRIL 30) : భారత పర్యావరణ ఉద్యమకారుడు, అడవులు – గిరిజన హక్కుల కార్యకర్త అలోక్ శుక్లాకు ప్రతిష్టాత్మక ‘గోల్డ్ మాన్ ఎన్విరాన్మెంటల్ పురస్కారం’ 2024 (green Nobel 2024 alok shukla) దక్కింది.

చత్తీస్‌ఘడ్ లో ఉన్న హస్దియో అడవులలో గనుల తవ్వకాన్ని నిరోధించడానికి తీవ్ర పోరాటం చేసినందుకు గుర్తింపుగా ఈ బహుమతిని ప్రకటించారు.

గోల్డ్ మాన్ ఎన్విరాన్మెంటల్ పురస్కారాన్ని గ్రీన్ నోబెల్ బహుమతిగా పరిగణిస్తారు. పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు ఈ బహుమతిని గోల్డ్ మాన్ ఎన్విరాన్మెంటల్ ఫౌండేషన్ వారు అందజేస్తారు.