GOLDEN GLOBE : గోల్డేన్ గ్లోబ్ అవార్డులు – భారతీయ సినిమాలు

BIKKI NEWS : గోల్డేన్ గ్లోబ్ పురష్కారాలు హలీవుడ్, మరియు ఇతర బాషలలో వచ్చిన చిత్రాలు మరియు టెలివిజన్ షోలకు అందజేస్తారు. 80వ గోల్డేన్ గ్లోబ్ అవార్డులకు RRR సినిమా రెండు విభాగాలలో నామినేట్ అయింది. ఆస్కార్ అవార్డుల తర్వాత అత్యున్నత అవార్డుగా గోల్డేన్ గ్లోబ్ అవార్డు ను పరిగణిస్తారు. (golden-globe-awards for india films)

ఈ అవార్డులను ఎంపిక చేసేది 105 మంది అంతర్జాతీయ జర్నలిస్టులు. వారీ ఓటింగ్ మీద ఆధారపడి అవార్డులను కేటాయిస్తారు.

మొదటి సారి గోల్డేన్ గ్లోబ్ అవార్డులను 1944 లో లాస్ ఎంజెల్స్ లో నిర్వహించారు. జనవరి 10 – 2023 లో నిర్వహించే 80వ గోల్డేన్ గ్లోబ్ అవార్డులు 2022 కు సంబంధించిన చిత్రాలకు అందజేయనున్నారు.

★ గోల్డేన్ గ్లోబ్ అవార్డులు – భారతీయ సినిమాలు.

టాలీవుడ్ కు చెందిన RRR సినిమా ‘ఉత్తమ ఆంగ్లేతర చిత్రం’ విభాగంలో మరియు ఎం.ఎం. కీరవాణి స్వరపరచిన ‘నాటు‌ నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది.

కీరవాణి స్వరపరచిన ‘నాటు‌ నాటు‘ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది.

1959లో విదేశీ బాషా విభాగంలో ఉత్తమ చిత్రంగా ‘దో ఆంఖే బారా హథ్’ చిత్రానికి ‘ఉత్తమ చిత్రం’ అవార్డు వచ్చింది.

మహాత్మా గాంధీ జీవిత చరిత్ర “గాంధీ” సినిమాకు ‘వివిధ కేటగిరీలలో ‘ 6 గోల్డేన్ గ్లోబ్ అవార్డులు వచ్చాయి.

2009 లో ‘స్లమ్ డాగ్ మిలీనియర్’ సినిమా కు ‘బెస్ట్ స్కోర్’ విభాగంలో గోల్డేన్ గ్లోబ్ అవార్డు దక్కింది.

గోల్డేన్ గ్లోబ్ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ‘ఏ.ఆర్. రేహ్మాన్’

విదేశీ బాషా చిత్రంలో నామినేట్ అయినా ‘మీరా నాయర్’ దర్శకత్వం వహించిన సినిమాలు ‘సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్’