GNM ADMISSIONS : అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్ (సెప్టెంబర్ 02) : తెలంగాణ రాష్ట్రంలో 2023 – 24 విద్యా సంవత్సరానికి గానూ ప్రభుత్వ, ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో జనరల్ నర్సింగ్ & మిడ్వైఫరీ (GNM ADMISSIONS IN TELANGANA) ట్రైనింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది.

◆ ముఖ్య సమాచారం

ఇంటర్మీడియట్, వోకెషనల్ ANM మరియు హెల్త్ కేర్ సైన్స్ కోర్స్ చేసిన అభ్యర్థులు అర్హులు.

సెప్టెంబర్ 02 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 19 వరకు డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తు ఫారాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.

అక్టోబర్ 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

వెబ్సైట్ : http://dme.telangana.gov.in