HUNGER INDEX 2024 – ప్రపంచ ఆకలి సూచీ నివేదిక

BIKKI NEWS (OCT. 12) : GLOBAL HUNGER INDEX 2024. ప్రపంచ ఆకలి సూచీ 2024 నివేదికను 127 దేశాలతో రూపొందించారు. ఇది 19వ నివేదిక. దీనిని కంసర్న్ వరల్డ్ వైడ్ మరియు వెల్త్ హంగర్ లైఫ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి.

GLOBAL HUNGER INDEX 2024.

ఈ నివేదికలో భారత్ 127 దేశాలలో 105వ స్థానంలో (India rank in global hunger index 2024) నిలిచింది. భారత్ స్కోరు 29.3 నిర్ధారించారు. భారతను ‘ఆందోళనకర విభాగం’ లో చేర్చారు.

పొరుగు దేశాలు అయినా శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, నేపాల్ లు భారత్ కంటే మెరుగైన ర్యాంకును సాధించాయి.

ఆకలి సూచీ 2024 లో టాప్ 5 బెస్ట్ దేశాలు

1) బెలారస్
2) బోస్నియా & హార్జిగోవినా
3) చిలీ
4) చైనా
5) కోస్టారికా

ఆకలి సూచీ 2024 లో చివరి 5 దేశాలు

127) సోమాలియా
126) యోమెన్
125) చాద్
124) మడగాస్కర్
123) కాంగో రిపబ్లిక్

భారత పొరుగు దేశాల ర్యాంక్స్

04) చైనా
56) శ్రీలంక
68) నేపాల్
74) మయన్మార్
84) బంగ్లాదేశ్
107) ఇండియా
109) పాకిస్థాన్
116) అఫ్ఘనిస్తాన్

2020 ఆకలి సూచీలో భారత్ 107 దేశాలలో 94వ స్థానంలో నిలిచింది

2021 ఆకలి సూచీలో భారత్ 101వ స్థానంలో నిలిచింది

2022 ఆకలి సూచీలో భారత్ 121 దేశాలలో 107వ స్థానంలో నిలిచింది.

2023 ఆకలి సూచీలో భారత్ 125 దేశాలలో 111వ స్థానంలో నిలిచింది.

భారత్ లో పిల్లల్లో పోషకాహార లోపం తీవ్రంగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొన్నది.

చైల్డ్ వేస్టింగ్ రేటు (పిల్లలు ఎత్తుకు తగ్గ బరువు లేక పోవడం)లో 18.7 శాతంతో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో ఉంది.

చైల్డ్ స్టంటింగ్ రేట్ (పిల్లల్లో వయసుకు తగ్గట్టుగా ఎదుగుదల లేకపోవడం) భారత్లో 35.5 శాతం ఉండగా,

ఐదేండ్ల లోపు చిన్నారుల మరణాల రేటు 2.9 శాతంగా ఉంది.

దేశంలో పోషకాహార లోపం 13.7 శాతం ఉంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు