GLOBAL GENDER GAP INDEX 2024 – లింగ సమానత్వ సూచీ

BIKKI NEWS (JUNE 20) : GLOBAL GENDER GAP INDEX 2024 by World Economic Forum. ప్రపంచ ఎకానమిక్ ఫోరమ్ 2024 లింగ సమానత్వ సూచీ ని విడుదల చేసింది.

లింగ సమానత్వ సూచీని మొట్టమొదటి సారిగా 2006 లో WEF ప్రారంభించింది.

2024 లింగ సమానత్వ సూచీలో భారత దేశం 146 దేశాల జాబితాలో 129వ స్థానంలో నిలిచింది. 2023 లో భారత్ 127వ స్థానంలో నిలిచింది. 2022లో భారత్ 135వ స్థానంలో నిలిచింది. 2021 లో భారత్ 140వ స్థానంలో నిలిచింది. గతేడాది తో పోలిస్తే ఈ సంవత్సరం భారత్ 2 స్థానాలు దిగజారింది.

భారత చుట్టుపక్కల దేశాలతో పోలిస్తే పాకిస్తాన్ తప్ప అన్నీ దేశాలం కూడా భారత్ కంటే మెరుగైన స్థానాన్ని పొందడం విశేషం.

మొత్తం 146 దేశాలతో 2024లో గ్లోబల్ జెండర్ గ్యాప్ నివేదికను రూపొందించారు.

ఐస్‌లాండ్ (93.5%) దేశం ఈసారి కూడా మొదటి స్థానంలో ఉంది. మరియు గత పది సంవత్సరాలుగా ఇండెక్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దాని లింగ అంతరంలో 90%కి పైగా ఉన్న ఏకైక ఆర్థిక వ్యవస్థగా కూడా కొనసాగుతోంది. చివర స్థానంలో సూడాన్ దేశం నిలిచింది.

GLOBAL GENDER GAP INDEX 2024 TOP 10 COUNTRIES

1) ఐస్‌ల్యాండ్
2) పిన్లాండ్
3) నార్వే
4) న్యూజిలాండ్
5) స్వీడన్
6) నికరగ్వా
7) జర్మనీ
8) నమీబియా
9) ఐర్లాండ్
10) స్పెయిన్

LAST 10 COUNTRIES

146) సూడాన్
145) పాకిస్థాన్
144) చాద్
143) ఇరాన్
142) గినియా
141) మాలీ
140) కాంగో
139) అల్జీరియా
138) నైగర్
137) మొరాకో

భారత్ చుట్టుపక్కల దేశాల ర్యాంకింగ్స్

99) బంగ్లాదేశ్
106) చైనా
117) నేపాల్
122) శ్రీలంక
124) భూటాన్
129) ఇండియా
145) పాకిస్థాన్

LATEST CURRENT AFFAIRS IN TELUGU

OUR TELEGRAM CHANNEL