హైదరాబాద్ (జూన్ – 22) : ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) – 2023 లింగ సమానత్వ సూచిక (GLOBAL GENDER GAP INDEX 2023 REPORT) రిపోర్టును విడుదల చేసింది. 146 దేశాలకు గాను భారతదేశం 127 వ స్థానంలో నిలిచింది. 2022 లింగ సమానత్వ సూచీలో భారత్ 135 స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఎనిమిది స్థానాలను మెరుగుపరచుకుంది.
ప్రపంచ ఆర్థిక వేదిక 2006 నుండి లింగ సమానత్వ సూచి నివేదికను ప్రతి సంవత్సరం వెలువరిస్తుంది.
మొదటి స్థానంలో ఐస్లాండ్ దేశం వరుసగా 14వ సారి నిలిచి రికార్డు సృష్టించింది. చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ దేశం నిలిచింది.
స్త్రీ పురుషుల మధ్య అన్ని రంగాల్లో సమానత్వం సాధించడంలో భారతదేశానికి 64.3% పాయింట్లు రాగా ఆర్థిక సమానత్వంలో మాత్రం 36.7%తో వెనుకబడి ఉంది.
భారతదేశ పార్లమెంట్ లో మహిళల శాతం 15.1 శాతానికి చేరింది. స్థానిక సంస్థల్లో మహిళ ప్రాతినిధ్యం 44.4 శాతానికి చేరింది.
◆ మొదటి ఐదు స్థానాలు :
ఐస్ లాండ్, నార్వే, ఫిన్లాండ్, న్యూజిలాండ్, స్వీడన్.
◆ చివరి ఐదు దేశాలు
ఆఫ్ఘనిస్తాన్, చాద్, అల్జీరియా, ఇరాన్, పాకిస్తాన్
◆ మన పొరుగు దేశాల ర్యాంకులు :
బంగ్లాదేశ్ 59, భూటాన్ 103, చైనా 107, శ్రీలంక 115, నేపాల్ 116, పాకిస్తాన్ 142.
◆ వెబ్సైట్ : https://www.weforum.org/reports/global-gender-gap-report-2023/