BIKKI NEWS (AUG. 24) : GATE 2025 NOTIFICATION. గేట్ 2025 నోటిఫికేషన్ ను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. గేట్ స్కోర్ తో ఎంటెక్, పీహెచ్డీ లతో పాటు పబ్లిక్ సెక్టార్ యూనిట్ లలో ఉద్యోగాలు పొందే అవకాశం.
GATE 2025 NOTIFICATION
అలాగే ఎంటెక్ సీటు పొందిన అభ్యర్థులకు నెలకు 12,400 చొప్పున 22 నెలల పాటు స్కాలర్షిప్ అందిస్తారు. పిహెచ్డి లో మొదటి రెండు రెండేళ్లకు నెలకు 37వేల చొప్పున, తర్వాత మూడేళ్లకు 42 వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు.
గేట్ పరీక్షను మొత్తం 30 పేపర్లో నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి అభ్యర్థి రెండు పేపర్లకు హాజరయ్యే అవకాశం కలదు.
అర్హతలు : ప్రస్తుత విద్యా సంవత్సరంలో బీటెక్ ఇతర గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం లో మూడు నాలుగు సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : 2300/- (మహిళల SC, ST, PWD – 900/-… పురుష SC, ST, PWD – 1400/-)
దరఖాస్తు ప్రారంభం : ఆగస్ట్ 28 – 2024
దరఖాస్తు ముగింపు : అక్టోబర్ 11 – 2024
పరీక్ష తేదీలు : 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16వ తేదీలలో