Home > TELANGANA > Maha Laxmi Scheme – 500/- గ్యాస్ సిలిండర్ కి తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి.!

Maha Laxmi Scheme – 500/- గ్యాస్ సిలిండర్ కి తెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి.!

హైదరాబాద్ (డిసెంబర్ – 24) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా, 500/- రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందించే (Gas cylinder for 500/- in telangana) పథకానికి నియమ నిబంధనలు రూపొందించే పనిలో ఉంది. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డుదారులకు మాత్రమే 500/- రూపాయలకు గ్యాస్ సిలిండర్ అందించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం.

డిసెంబర్ 28 – 2023 నుండి ఈ పథకం ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం డిసెంబర్ 28 నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన పేరిట దరఖాస్తులు స్వీకరించి అర్హత గల వారికి 500/- రూపాయలకే గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమం ప్రారంభించనున్నట్లు సమాచారం.

★ 500/- గ్యాస్ సిలిండర్ నిబంధనలు

రాష్ట్రవ్యాప్తంగా 85.59 తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. కానీ గ్యాస్ కనెక్షన్లు మాత్రం 1.20 కోట్లు ఉన్నాయి.

రేషన్ కార్డుతో మ్యాపింగ్ అయినా గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 63.6 లక్షలు ఉన్నట్లు సమాచారం.

ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ కలిగిన వారికి 340/- రూపాయల రాయితీ అందుతుంది. వీరి సంఖ్య 11.58 లక్షలుగా ఉంది.

రాయితీ సిలిండర్లు సంవత్సరానికి 6 ఇవ్వాలా 12 ఇవ్వాలా అనేదాని పైన కూడా స్పష్టత రావాల్సి ఉంది.

కొత్త రేషన్ కార్డు తీసుకునే వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేయున్నట్లు సమాచారం.

ఇప్పటినుండి కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకునే వారికి ఈ పథకం వర్తింప చేయకూడదని పౌరసరఫల శాఖ నిర్ణయించినట్లు సమాచారం.