న్యూఢిల్లీ (జూన్ -19) : జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఇస్తున్న గాంధీ శాంతి బహుమతి 2021 (Gandhi Peace Prize 2021) కి గాను గోరఖ్ పూర్ కు చెందిన ప్రముఖ ముద్రణ సంస్థ “గీతా ప్రెస్” (Gita Press) కు ఇవ్వడం జరిగింది.
శాంతి సామరస్యత వంటి గాంధీ ఆలోచనలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో గీత ప్రెస్ బలమైన కృషి చేస్తుందని జాతీయ సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 1995లో స్థాపించిన గాంధీ శాంతి బహుమతి అందుకున్న వారికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందజేస్తారు.
1923లో ప్రారంభమైన గీతా ప్రెస్ 14 భాషల్లో 41.7 కోట్లకు పైగా పుస్తకాలను ముద్రించింది.
- DAILY GK BITS IN TELUGU 4th SEPTEMBER
- DAILY GK BITS IN TELUGU 3rd SEPTEMBER
- DAILY GK BITS IN TELUGU 2nd SEPTEMBER
- DAY WISE CURRENT AFFAIRS 2024
- CURRENT AFFAIRS SEPTEMBER 2024