Home > CURRENT AFFAIRS > AWARDS > GADDAR FILM AWARDS 2024 – గద్దర్ సినీ అవార్డులు పూర్తి లిస్ట్

GADDAR FILM AWARDS 2024 – గద్దర్ సినీ అవార్డులు పూర్తి లిస్ట్

BIKKI NEWS (MAY 29) : GADDAR FILM AWARDS 2024 LIST. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద 2024 సంవత్సరానికి సంబంధించి సినీ అవార్డుల‌ని ప్రకటించింది.

GADDAR FILM AWARDS 2024

గద్దర్ అవార్డుల జ్యూరీ సీనియర్ నటి జయసుధ, తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజుతో కలిసి అవార్డుల జాబితాను ప్రకటించారు.

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులను ప్రకటించారు.

మొత్తం 1248 నామినేష‌న్స్ రాగా, వాటిని ప‌రిశీలించి అవార్డుల గ్ర‌హీత‌ల‌ని ప్ర‌క‌టించారు. ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ న‌టుడు స‌హా మొత్తం 21 మందికి వ్య‌క్తిగ‌త‌, స్పెష‌ల్ జ్యూరీ అవార్డులు ప్ర‌క‌టించారు.

వీటితో పాటు ఎన్టీఆర్, పైడి జ‌య‌రాజ్‌, బీఎన్ రెడ్డి, నాగిరెడ్డి- చ‌క్ర‌పాణి, కాంతారావు , ర‌ఘుప‌తి వెంక‌య్య పేర్ల‌తో కూడా అవార్డులు ప్ర‌క‌టించారు. ఈ అవార్డుల ప్ర‌ధానోత్స‌వం జూన్‌ 14న హైటెక్స్‌లో జ‌ర‌గ‌నుంది.

2014 నుంచి 2023 వరకు ఒక్కో సంవత్సరానికి గానుగద్దర్ అవార్డులను త్వరలోనే ప్రకటించనున్నారు.

GADDAR FILM AWARDS 2024 LIST

  • ఉత్తమ చిత్రం – కల్కి
  • ఉత్తమ రెండో – పొట్టేలు
  • ఉత్తమ మూడో చిత్రం – లక్కీ భాస్కర్
  • ఉత్తమ నటుడు- అల్లు అర్జున్ (పుష్ప-2)
  • ఉత్తమ నటి : నివేదా థామస్ (35 చిన్న కథ కాదు)
  • బెస్ట్ డైరెక్టర్- నాగ్ అశ్విన్ (కల్కి)
  • బెస్ట్ స్క్రీన్ ప్లే – వెంకీ అట్లురీ ( లక్కీ భాస్కర్)
  • బెస్ట్ కమెడియన్ – సత్య, వెన్నెల కిషోర్
  • బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – ఎస్. జె సూర్య (సరిపోదా శనివారం)
  • బెస్ట్ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య
  • బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ – చంద్రశేఖర్
  • స్పెషల్ జ్యురీఅవార్డు -దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్ )
  • బెస్ట్ స్టోరీ రైటర్ – శివ పాలడుగు
  • స్పెషల్ జ్యురీ అవార్డు ఫీమేల్ – అనన్య (పొట్టేలు)
  • ఉత్తమ సామాజిక చిత్రం : కమిటీ కుర్రోళ్లు
  • ఉత్తమ బాలల చిత్రం : 35 చిన్నకథ కాదు
  • ఉత్తమ హెరిటేజ్ ఫిల్మ్ : రజాకార్
  • ఉత్తమ నూతన దర్శకుడు : ఎదు వంశీ
  • హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ : ఆయ్
  • బెస్ట్ సపోర్టింగ్ నటి : అంబాజీపేట ఫేమ్ శరణ్య
  • మ్యూజిక్ : భీమ్స్ (రజాకార్)
  • బెస్ట్ సింగర్ : సిధ్ శ్రీరామ్ (ఊరు పేరు భైరవకోన)
  • బెస్ట్ సింగర్ (ఫీమేల్) : శ్రేయా ఘోషాల్ (పుష్ప 2)
  • ఉత్తమ బాల నటులు : అరుణ్ దేవ్ (35 చిన్న కథ కాదు), హారిక (మెర్సీ కిల్లింగ్)
  • ఉత్తమ పాటల రచయిత : చంద్రబోస్ (రాజు యాదవ్)
  • బెస్ట్ సినిమాటోగ్రఫర్ : విశ్వనాథ్ రెడ్డి (గామీ)
  • బెస్ట్ ఎడిటర్ : నవీన్ నూలి (లక్కీ భాస్కర్)
  • బెస్ట్ ఆడియోగ్రాఫర్ : అరవింద్ మీనన్ (గామీ)
  • బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ ఆచార్య (దేవర ఆయుధ పూజ)
  • బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : అద్నితిన్ జిహానీ చౌదరి (కల్కి)
  • బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్ర శేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు