BIKKI NEWS (JUNE 25) : Free training in agriculture. ఆధునిక వ్యవసాయ విధానాల్లో ముమ్మర శిక్షణకు గాను వ్యవసాయంలో ఆరు నెలల ఉచిత శిక్షణ కోర్సుకు ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
Free training in agriculture.
శిక్షణ పొందిన అభ్యర్థులకు వ్యవసాయ సంబంధిత పరిశ్రమలలో ఉపాధి అవకాశములు లభించును.
వయోపరిమితి : అభ్యర్థులు 15-25 ఏళ్ళ లోపు వారై ఉండాలి.
విద్యార్హతలు: కనీసం పదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
గ్రామీణ వ్యవసాయ నేపథ్యం లేదా వ్యవసాయంలో పనిచేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం.
కోర్పు చేసేందుకు ఎలాంటి రుసుము లేదు. క్యాంపస్ లోనే ఉచిత వసతి మరియు భోజనం కల్పించబడును.
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు ఇంటర్వూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
కోర్సు ఆగష్ట్, 2025 మొదటి వారంలో ఆరంభమవుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు వివరాలను కింద ఇవ్వబడిన చిరునామాకు పంపాలి
- తాజా బయోడేటా (పేరు, తండ్రిపేరు, పుట్టిన తేది, చిరునామా, విద్యార్హత, ఫోన్ నెంబర్)
- పదోతరగతి మార్కుల జాబితా
- ఆదార్ జిరాక్స్
చిరునామా : డైరెక్టర్, డా. డి. రామానాయుడు విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తునికి గ్రామం, కౌడిపల్లి మండలం, మెదక్ జిల్లా 502316, తెలంగాణ.
ఫోన్ నంబర్లు : 81062 55535, 81850 60769
అభ్యర్థులు తమ బయోడేటాను. స్కాన్ చేసిన పత్రాలను drnvjird1 @gmail.com కు మెయిల్ చేయవచ్చు.
ఇనిస్టిట్యూట్ వద్ద దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది 25 జూలై 2025.
- LOCAL BODY ELECTIONS – స్థానిక ఎన్నికల నిర్వహణకు గడువు విధించిన హైకోర్టు
- GOLD RATE – మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
- Rajiv Yuva Vikasam – స్థానిక ఎన్నికల తర్వాత రాజీవ్ యువవికాసం.!
- BTech counseling – బీటెక్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కు బ్రేక్
- NEERAJ CHOPRA – గోల్డెన్ స్పైక్ త్రో విజేత నీరజ్ చోప్రా