Home > EDUCATION > GURUKULA NEWS > గురుకుల విద్యార్థులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ

గురుకుల విద్యార్థులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ

BIKKI NEWS (MAY 27) : free training for gurukula students. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న చదువు పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులకు ఉపాధి కల్పన లక్ష్యంగా నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల కార్యదర్శి అలుగు వర్షిణి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

free training for gurukula students

ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి ఉంటుందని, పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ పూర్తి చేసిన, డిగ్రీ ఫెయిల్ అయిన, చదువుతున్న విద్యార్థులతోపాటు చదువు మధ్యలో మానేసిన 18 నుండి 25 సంవత్సరాల వయసు కలిగిన వారు ఈ శిక్షణకు అర్హులు అని తెలిపారు.

శిక్షణకు హాజరయ్యే విద్యార్థులు సమీపంలోని గురుకుల పాఠశాలలు లేదా కళాశాలలో ఈనెల 30వ తేదీ వరకు తమ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పూర్తి వివరాలకు సమీపంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు లేదా కళాశాలల ప్రిన్సిపల్ లను కలవాలని వరంగల్ తూర్పు గురుకుల కళాశాల ప్రిన్సిపల్ డా వి. రాధిక గారు తెలియజేశారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు