BIKKI NEWS (JUNE 04) : free text books for govt junior college students. ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువుతున్న విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి పాఠ్య పుస్తకాల ముద్రణ మరియు పంపిణీ కార్యక్రమాన్ని ఇంటర్మీడియట్ విద్యా శాఖ ప్రారంభించింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి విద్యార్థులకు పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం.
free text books for govt junior college students.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.5 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉండగా, వీరిలో సుమారు 1.7 లక్షల మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో చదువతున్నారు. గత సంవత్సరాల్లో జాలై లేదా ఆగస్టు నెలల్లో మాత్రమే పుస్తకాలు అందే పరిస్థితి ఉండగా, ఈ సంవత్సరం ముందుగానే కార్యాచరణ ప్రణాళిక రూపొందింది అమలు చేయడం ద్వారా విద్యా సంవత్సరం ప్రారంభానికి విద్యార్థులకు పుస్తకాలు అందించటంలో పురోగతి సాధించింది.
మొదటి సంవత్సర విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా పాఠ్య పుస్తకాల ముద్రణ పూర్తయింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పుస్తకాల పంపిణీ ఇప్పటికే ప్రారంభంకాగా, 2025 జూన్ మొదటి వారంలో పంపిణీ పూర్తి కానుంది. తద్వారా కళాశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి.
ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పుస్తకాల ముద్రణ తుది దశలో ఉంది. 2025 జూన్ మొదటి వారంలోపుగా ముద్రణ పూర్తవుతుంది. కాలేజీ ప్రిన్సిపాళ్లతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారులను నియమించారు. కాలేజీల నుండి అవసరమైన పుస్తకాల వివరాలను ముందుగానే సేకరించడం ద్వారా ముద్రణను వేగవంతం చేయడం జరిగింది. 2024-25 సంవత్సరానికి వినియోగించగా మిగిలిన పుస్తకాలను అవసరమైన చోట్ల పంపిణీ చేస్తున్నారు. పుస్తకాల పంపిణీకి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతమైన రవాణా వ్యవస్థను ఏర్పాటుచేయటం జరిగింది. ఇంటర్మీడియట్ విద్య మరియు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్య మండలి కార్యాలయంల నుండి అధికార్లు మరియు నియమిత బైబ్రరీయన్ బృందాలు రోజువారిగా పంపిణీపై పర్యవేక్షణ చేస్తున్నాయి. కళాశాలల ప్రిన్సిపాళ్లు పుస్తకాలు అందిన వెంటనే విద్యార్థులకు పంపిణీ చేసి, బోధన కార్యక్రమాలను ప్రారంభించాల్సిందిగా ఆదేశించమైనది.
విద్యా సంవత్సరం ప్రారంభమైన జూన్ మధ్య నాటికి 100% పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని శాఖ కట్టుబడిఉన్నట్లు డైరెక్టర్ ఇంటర్మీడియట్ విద్య శ్రీ. కృష్ణ ఆదిత్య, ఐ.ఏ.ఎస్.. తెలిపారు. ఈ చర్యల వల్ల విద్యా సంవత్సరం విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు..
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్