BIKKI NEWS (MAY 21) : free job training by swami ramanamda tirtha rural institute. తెలంగాణ రాష్ట్రంలోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ నిరుద్యోగులకు వసతితో కూడిన ఉచిత ఉపాధి శిక్షణ కొరకు ప్రకటన జారీ చేసింది.
free job training by swami ramanamda tirtha rural institute
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ధీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన పథకం ద్వారా నిరుద్యోగులకు ఈ శిక్షణ ఇస్తున్నారు.
అర్హులైన అభ్యర్థులు మే 29వ తేదీ వరకు ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోవచ్చు
శిక్షణ అందించే కోర్సుల వివరాలు
- అకౌంట్స్ అసిస్టెంట్ (ట్యాలీ)
- కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్
- డీటీపీ
- ఆటోమొబైల్ టు వీలర్ సర్వీసింగ్
అర్హతలు : కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ – బీకాం కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంత అభ్యర్థులై ఉండాలి. ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు అర్హులు కారు
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అర్హులు
మూడున్నర నెలల పాటు అర్హత కలిగిన అభ్యర్థులకు ఉచిత వసతితో కూడిన శిక్షణ అందించనున్నారు.
దరఖాస్తు పంపవలసిన చిరునామా :
స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ, జలాల్పూర్ గ్రామం, పోచంపల్లి మండలం, భువనగిరి జిల్లా, తెలంగాణ – 508284
వెబ్సైట్ : https://www.srtri.com/
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్