BIKKI NEWS (JUNE 21) : Free JEE, NEET, CLAT Coaching in Govt inter colleges. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూల్స్ మరియు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBVs) విద్యార్థుల కోసం “తెలంగాణ అచీవర్స్ 2025” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు JEE, NEET మరియు CLAT లాంటి పోటీ పరీక్షలకు ఉచిత, నాణ్యమైన ఆన్లైన్ కోచింగ్ అందించబడుతుంది.
Free JEE NEET CLAT coaching in govt colleges
ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన ఎడ్-టెక్ సంస్థ ఫిజిక్స్ వాల (Physics Walah) తో భాగస్వామ్యంగా అమలు చేయనున్నారు.
ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థులు కూడా జాతీయ స్థాయి పరీక్షలకు సమర్థంగా పోటీ పడేలా చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా, IAS ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలములో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులతో చర్చించారు.
జులై నెల నుండి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం డిసెంబర్ నెల వరకు “ఫిజిక్స్ వాలా” భాగస్వామ్యంతో కళాశాల ప్రిన్సిపాళ్లు అధ్యాపకుల పర్యవేక్షణలో నిర్వహించడం జరుగుతుంది.
JEE, NEET మరియు CLAT తరగతులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్ళు మరియు కేజీబీవీ లలో నిర్వహించబడతాయని తెలిపారు. ఇందుకు సంబంధించిన లాగిన్ వివరాలు కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మరియు విధ్యార్ధులకు అందించబడతాయి. దీని ద్వారా విధ్యార్థుల ప్రగతి నివేదికలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఈ కార్యక్రమ అమలుకు ముందు, తల్లిదండ్రులు మరియు అధ్యాపకులతో ప్రత్యేక అవగాహన సమావేశాలు కళాశాలల ప్రిన్సిపాళ్లు నిర్వహించనున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలకూ క్రీడా పరికరాలు పంపిణీ చేయనున్నారు. అలాగే, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికై ప్రిన్సిపాళ్లకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం త్వరలో నిర్వహించబడనుంది.
ఈ సమీక్షా సమావేశానికి శ్రీ కృష్ణ ఆదిత్య, IAS, డైరెక్టర్ & కార్యదర్శి, ఇంటర్మీడియట్ విద్యా శాఖ: డా. నవీన్ నికోలస్, IAS, డైరెక్టర్, పాఠశాల విద్యా శాఖ: శ్రీమతి జయప్రద బాయి, పరీక్షల నియంత్రణాధికారి, ఇంటర్మీడియట్ విద్యా మండలి : మోడల్ స్కూల్స్, KGBVs మరియు ఫిజిక్స్ వాల సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సమర్థవంతంగా సిద్ధమవుతారని మరియు సమాన అవకాశాలు కల్పించే దిశగా ఇది ఒక కీలక చర్యగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
- NEERAJ CHOPRA – పారిస్ డైమండ్ లీగ్ విజేత నీరజ్ చోప్రా
- Free Coaching – ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా జేఈఈ, నీట్, క్లాట్ కోచింగ్
- Annadhaatha Sukhibhava – 20 కాదు 14 వేలే
- DAILY GK BITS IN TELUGU 21st JUNE
- చరిత్రలో ఈరోజు జూన్ 21