BIKKI NEWS (JUNE 15) : FREE FOUNDATION COACHING BY ITDA. సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ, ఏటూరునాగారం పరిధిలో గల గిరిజన అభ్యర్ధుల ఫౌండేషన్ కోర్సుల శిక్షణకు దరఖాస్తుల స్వీకరిస్తుంది.
FREE FOUNDATION COACHING BY ITDA.
ఐ.టి.డి.ఏ, ఏటూరునాగారం ఆధ్వర్యంలో కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల నందు శిక్షణ ఇచ్చేందుకు గాను ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ. మహబూబాబాద్, జనగాం మరియు వరంగల్ జిల్లాలకు చెందిన ఆసక్తిగల డిగ్రీ పాసైన గిరిజన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా తేది 17-06-2025 సాయంత్రం 5.00 గంటల వరకు దరఖాస్తు చేసుకోగలరని ప్రాజెక్టు అధికారి ఐ.టి.డి.ఏ, ఏటూరునాగారం గారు ఒక ప్రకటనలో తెలియజేసినారు.
మరిన్ని వివరాలకు 7675978439 మరియు 8328546015 నెంబర్లకు పని దినాలలో ఉదయం 10.30 గం. నుండి సాయంత్రం 5.00 గం.ల లోపు సంప్రదించగలరు.
గ్రూప్స్, పోలీసు, బ్యాకింగ్, రైల్వేస్, ఎస్ఎస్‌సీ వంటి ఉద్యోగ పరీక్షలకు 75 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు
ఈ ఫౌండేషన్ శిక్షణకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.
జూన్ 22న అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను జూన్ 19న విడుదల చేయనున్నారు.
ఫలితాలను జూన్ 24న విడుదల చేసి, తరగతులను జూన్ 27 నుండి ప్రారంభించనున్నారు.
వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/ForwardingAction.do?status=stde
- RYTHU BHAROSA – వారంలో రైతు భరోసా, సన్న వడ్లకు 500/- బోనస్
- LOCAL BODY ELECTIONS – ఈ నెలలోనే సంస్థలకు ఎన్నికలు షెడ్యూల్ – పొంగులేటి
- FORBE’S WORLD BILLIONAIRES 2025 – ప్రపంచ అపర కుబేరుడిగా ఎలాన్ మస్క్
- MAGNA CARTA DAY – మాగ్నా కార్టా దినోత్సవం జూన్ 15
- OU NEWS – ఉస్మానియాలో ఉచిత కోచింగ్